ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సానుకూల పనితీరును నమోదు చేసిన డిఒఎన్‌ఈఆర్‌ మంత్రిత్వశాఖకు చెందిన పిఎస్‌యుఎస్‌ ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి మరియు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసిలు


సానుకూల వృద్ధి ధోరణులను సాధించినందుకు రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి మరియు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసిలను డోనర్ మంత్రిత్వ శాఖ గుర్తించింది మరియు ప్రశంసించింది. అలాగే ఈ ప్రయత్నం పట్ల నిరంతర మార్గదర్శకత్వం మరియు నిరంతర మద్దతును అందించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.

డోనర్‌ మంత్రిత్వ శాఖకు చెందిన రెండు పిఎస్‌యులు ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి మరియు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసిలు అద్భుతమైన పనితీరును నమోదు చేసినందుకు కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అభినందించారు మరియు ఈశాన్య ప్రాంతంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ యొక్క అలుపెరగని దృష్టికి ఇది నిదర్శనమని అన్నారు.

నార్త్ ఈస్టర్న్ హస్తకళల హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. ఈశాన్య భారతదేశంలోని హస్తకళలు మరియు హ్యాండ్‌లూమ్స్ సెక్టార్‌లో చేంజ్‌మేకర్‌గా గుర్తింపు పొందింది.

నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఆర్‌ఎఎంఎసి) ప్రభుత్వం నిర్దేశించిన ప్రతిపాదిత టర్నోవర్‌ను అధిగమించింది.

Posted On: 20 JUL 2023 2:09PM by PIB Hyderabad

సానుకూల వృద్ధి ధోరణులను సాధించినందుకు రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి మరియు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసిలను డోనర్‌ మంత్రిత్వ శాఖ గుర్తించింది మరియు ప్రశంసించింది మరియు ఈ ప్రయత్నం పట్ల నిరంతర మార్గదర్శకత్వం మరియు నిరంతర మద్దతు కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది.

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కూడా డోనర్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థలు న్‌ఈహెచ్‌హెచ్‌డిసి లిమిటెడ్‌ మరియు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసిల ప్రభావం మరియు అవుట్‌పుట్ పరంగా అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు అభినందనలు తెలిపారు.

ఈశాన్య భారతదేశంలోని హస్తకళలు మరియు చేనేత రంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన నార్త్ ఈస్టర్న్ హ్యాండ్‌లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి లిమిటెడ్‌)కు గవర్నెన్స్ విభాగంలో స్కోచ్ సిల్వర్ ప్రైజ్ లభించింది.

ఈశాన్య ప్రాంతంలో సాంప్రదాయ హస్తకళలు మరియు చేనేత గొప్ప వారసత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు అభివృద్ధి చేయడంలో వారి ప్రయత్నాలకుగాను ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసిలిమిటెడ్‌ను "ఈశాన్య భారతదేశ హస్తకళలు మరియు చేనేత రంగంలో మార్పు చేసే సంస్థ"గా పాలన మరియు సామాజిక అభివృద్ధి రంగంలో స్కోచ్ సిల్వర్ ప్రైజ్ గుర్తించింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో స్థానిక కళాకారులకు అభివృద్ధి వేదికను అందించడంలో కార్పొరేషన్ కీలకపాత్ర పోషించింది మరియు ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే కళాకారులు మరియు నేత కార్మికులను అందించడంలో మరియు ఈశాన్య భారత రాష్ట్రాల ఆర్థిక వృద్ధి మరియు సామాజిక సాధికారతకు తోడ్పడింది.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవలి కాలంలో గణనీయమైన మైలురాళ్లను సాధించిన మరొక పిఎస్‌యు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసి.ఈ సంస్థ లాభాలను నమోదు చేసింది మరియు క్యాబినెట్ నిర్దేశించిన లక్ష్య టర్నోవర్‌ను అధిగమించింది. ఈ ఏడాది ప్రారంభంలో పునరుద్ధరణ ప్యాకేజీకి రూ.77.45 కోట్లు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసికి అందించబడింది. తద్వారా దాని వృద్ధి మరియు విజయాన్ని మరింత సులభతరం చేసింది.

ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి లిమిటెడ్‌ మరియు ఎన్‌ఈఆర్‌ఎఎంఎసి రెండూ కూడా గత రెండు సంవత్సరాలుగా సానుకూల పనితీరును కనబరిచాయియ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మరియు పురోగతికి దోహదపడ్డాయి. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక పనితీరు రేటింగ్‌లో డోనర్‌ మంత్రిత్వ శాఖలోని పిఎస్‌యులు రెండూ పైకి ట్రెండ్‌ను నమోదు చేశాయి. ఎన్‌ఈఆర్‌ఎఎంఎసి అద్భుతమైనదిగా రేట్ చేయబడింది. అలాగే ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి మంచి రేటింగ్‌ సాధించింది.

మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తమ బృందాల కృషిని, సంకల్పాన్ని అభినందించారు. ఈ విజయాలు ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధి మరియు అభ్యున్నతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.

ఈశాన్య హస్తకళల హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి ఎల్‌టిడి) అనేది భారత ప్రభుత్వంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న స్వయంప్రతిపత్త సంస్థ. ఎన్‌ఈహెచ్‌హెచ్‌డిసి లిమిటెడ్‌ ఈశాన్య ప్రాంతంలో హస్తకళలు మరియు చేనేతలను ప్రోత్సహించడం, మార్కెటింగ్ చేయడం మరియు అభివృద్ధికి అంకితం చేయబడింది. ఇది స్థానిక కళాకారులు మరియు నేత కార్మికులను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది.

నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఈఆర్‌ఎఎంఎసి) అనేది భారత ప్రభుత్వంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద ఒక పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (పిఎస్‌యు). ఈశాన్య ప్రాంతం నుండి వ్యవసాయ ఉత్పత్తులు మరియు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్ మద్దతును అందించడానికి ఎన్‌ఈఆర్‌ఎఎంఎసి పని చేస్తుంది. ఇది రైతుల ఆదాయం మరియు జీవనోపాధిని పెంచడానికి ఉద్దేశించబడింది.

 

 

***


(Release ID: 1941184) Visitor Counter : 154


Read this release in: English , Khasi , Urdu , Hindi , Tamil