కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

జి –20 ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాల సందర్భంగా ఈ–శ్రమ్ పై ప్రెజెంటేషన్ ఇచ్చిన ఇండియా.


అసంఘటిత రంగంపై, రూపుదిద్దుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద సమాచార నిధి ఈ – శ్రమ్ పైన, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ (ఎన్సిఎస్ )పైన ఇండియా ప్రజెంటేషన్ ఇచ్చింది

భారతదేశం అధ్యక్షతన జి 20 సమావేశాల లో భాగంగా ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈ రోజు ఇండోర్లో ప్రారంభమయ్యాయి.

Posted On: 19 JUL 2023 5:18PM by PIB Hyderabad

భారతదేశ అధ్యక్షతన జరుగుతున్న జి 20 సమావేశాలలో ,నాలుగవ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ ( ఇడబ్ల్యుజి) సమావేశం ఈరోజు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రారంభమైంది. సమావేశాల ప్రారంభసెషన్ లో
కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వశాఖ కార్యదర్శి , జి20 ఇడబ్ల్యుజి ఛైర్ , శ్రీమతి ఆర్తి అహుజ , ఈ సమావేశానికి హాజరైన  ప్రతినిధులకు స్వాగతం పలికారు.  గత మూడు ఇడబ్ల్యుజి సమావేశాలలో జరిగిన చర్చలు
సాధించిన పురోగతి  ని వివరించారు. మినిస్టీరియల్ డిక్లరేషన్ ముసాయిదా రూపకల్పన పూర్తి కాగలదని, రాగల సెషన్లలో ఫలితాల డాక్యుమెంట్లు పూర్తి కాగలవన్న ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు.

ఇండొనేసియా, బ్రెజిల్ వంటి సహ ఛైర్ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. ఫలప్రదమైన చర్చల ద్వారా ఈ సమావేశ లక్ష్యం పూర్తి కాగలదన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.
ఇండియా ఈ– శ్రమ్ పై ప్రెజెంటేషన్ ఇచ్చింది.  , అసంఘటిత రంగంపై,   రూపుదిద్దుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద సమాచార నిధి ఈ – శ్రమ్ పైన, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ (ఎన్సిఎస్ )పైన ఇండియా ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ శ్రమ్, ఎన్సిఎస్ పోర్టళ్ల ప్రజెంటేషన్ను  అంతర్జాతీయ ప్రతినిధులకుకూడా అందించడం జరుగుతుంది. ఈ రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిపై ప్రతినిధులు ఎంతో ఆసక్తి ప్రదర్శించారు.
తదుపరి జరిగే సమావేశాలలో ముసాయిదా మినిస్టీరియల్ డిక్లరేషన్, ఫలితాల డాక్యుమెంట్ కు సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ డాక్యుమెంట్లను ఖరారు చేసేందుకు ఇందులో చర్చించారు.
అంతకు ముందు ఉదయం, ప్రతినిధుల కోసం యోగా సెషన్ ను ఏర్పాటు చేశారరు. స్వల్ప యోగా కార్యక్రమాన్ని సమావేశం  సందర్భంగా కూడా నిర్వహించారు. చారిత్రాత్మక మండు ఫోర్ట్సిటీకి ప్రతినిధులను తీసుకువెళ్లి చూపించారు.

 

***



(Release ID: 1940896) Visitor Counter : 162