రక్షణ మంత్రిత్వ శాఖ
ఇండొనేషియాలోని జకార్తా చేరుకున్న ఐఎన్ఎస్ సహ్యాద్రి & ఐఎన్ఎస్ కోల్‌కత
Posted On:
18 JUL 2023 12:18PM by PIB Hyderabad
ఆగ్నేయ ఐఒఆర్ మిషన్‌లో మోహరించిన రెండు భారతీయ యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్‌కతా 17 జులై 2023న జకార్తా చేరుకున్నాయి. ఇండొనేషియా నావికాదళం ఆ నౌకలను సాదరంగా స్వాగతించింది.
రేవులో స్వల్పకాలం ఆగిన సందర్భంలో రెండు నావికాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, వగాహనను బలోపేతం చేసే లక్ష్యంతో భారతీయ, ఇండొనేషియా నావికాదళాలు వృత్తిపరమైన సంభాషణలు, ఉమ్మడి యోగా సెషన్లు, క్రీడలు, అంతర్ డెక్ సందర్శనలు వంటి కార్యకలాపాలలో నిమగ్నం కానున్నారు.
ఆపరేషనల్ టర్న్అరౌండ్ పూర్తి అయిన తర్వాత, రెండు నౌకలు సముద్రంలో ఇండినేషియా నావికాదళంతో కలిసి మారిటైం పార్ట్నర్‌షిప్ ఎక్సర్‌సైజ్ (ఎంపిఎక్స్ - నావికాదళ భాగస్వామ్య విన్యాసం)లో పాల్గొంటాయి. ఇప్పటికే ఇరు నావికాదళాల మధ్య ఉన్నత స్థాయిలో గల అంతర్ కార్యాచరణను మరింత బలోపేతం చేయడం ఈ విన్యాసాల లక్ష్యం.
ఐఎన్ఎస్ సహ్యాద్రి దేశీయంగా రూపకల్పన చేసి, నిర్మించిన ప్రాజెక్ట్ -17 తరగతి మూడవ రహస్య యుద్ధ నౌక కాగా, ఐఎన్ఎస్ కోల్‌కతా తొలిసారి దేశీయంగా రూపకల్పన చేసి, ప్రాజెక్ట్ -15 ఎ క్లాస్ కింద నిర్మించిన స్టెల్త్ డిస్ట్రాయర్. రెండు నౌకలను ముంబైలోని మజాగాంవ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించారు.
***
(Release ID: 1940600)
Visitor Counter : 157