ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ఓమన్ చాండీ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 JUL 2023 10:09AM by PIB Hyderabad
కేరళ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ఓమెన్ చాండీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఆయన తో తాను వేరు వేరు సందర్భాల లో జరిపిన సంభాషణల ను, మరీ ముఖ్యం గా వారు ఇద్దరు వారి వారి రాష్ట్రాల కు ముఖ్యమంత్రులు గా ఉన్నప్పుడు జరిపిన చర్చల ను గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ ఓమెన్ చాండీ గారి మరణం తో మనం ఒక వినయశీలి మరియు సమర్పణ భావం కలిగినటువంటి నేత ను కోల్పోయాం. ఆయన తన జీవనాన్ని సార్వజనిక సేవ కోసం అంకితం చేశారు; కేరళ యొక్క ప్రగతి కై పాటుపడ్డారు. ఆయన తో వేరు వేరు సందర్భాల లో జరిపిన సంభాషణ లు నాకు గుర్తున్నాయి. మరీ ముఖ్యం గా మేం ఇరువురం మా మా రాష్ట్రాల కు ముఖ్యమంత్రులు గా ఉన్నప్పుడు మరియు ఆ తరువాత నేను దిల్లీ కి వచ్చేసిన తరువాత మేం మాట్లాడుకున్న సంగతులు నాకు జ్ఞాపకమున్నాయి. ఈ దుఃఖ భరిత ఘడియ లో ఆయన కుటుంబాని కి మరియు ఆయన మద్ధతుదారుల కు కలిగిన బాధ లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ఇవ్వు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1940485)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada