ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్బంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటన

Posted On: 14 JUL 2023 10:45PM by PIB Hyderabad

        ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాన్స్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ భారత్ - ఫ్రాన్స్ మధ్య 1998లో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం రజతోత్సవం సందర్బంగా ఫ్రాన్స్ జాతీయ  దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని తన చారిత్రాత్మక పర్యటన ముగించారు.   అనిశ్చిత ప్రపంచంలో రోజురోజుకు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత్ - ఫ్రాన్స్ 1998 జనవరి నెలలో రెండు దేశాల మధ్య సంబంధాలను అప్పటి  ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి,  ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్
వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు.  ఏదైనా దేశంతో ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి.

         1947లో భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉన్న నిర్ణయాత్మక నిబద్ధత  బలమైన, స్థిరమైన భాగస్వామ్యంలో చేసిన అసాధారణమైన ప్రయత్నాలలో ప్రతిబింబించిన పరస్పర విశ్వాసాన్ని ధ్రువీకరించడమే.
 
          శ్రీ మోడీ పర్యటన సందర్బంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు.    చీకటి తుపానుల వంటి అవరోధాలను కూడా అధిగమించి నిలకడగా సాగే  బంధం తమదని వారు అంగీకరించారు.   అవరోధాలను ధైర్యంగా అధిగమించి ముందుకు సాగిన తీరు
ప్రతిష్టాత్మకంగా  ఉందని వారన్నారు.  ఇది భాగస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం మరియు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై నమ్మకం, అంతర్జాతీయ చట్టం మరియు UN చార్టర్‌పై తిరుగులేని నిబద్ధత, బహుపాక్షికతపై స్థిరమైన విశ్వాసం, స్థిరమైన బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఉమ్మడి విలువల పునాదులపై స్థాపించిన  బంధమని అన్నారు.  

          గత పాతికేళ్లలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ప్రతి రంగంలో వచ్చిన పరివర్తన, విస్తరణను
ప్రధాని మోదీ మరియు అధ్యక్షుడు మాక్రాన్  సమీక్షించారు. భాగస్వామ్యం పరిణామక్రమంలో  తమకున్న ప్రాంతీయ
 బాధ్యతలు మరియు ప్రపంచ ప్రాముఖ్యత గురించి వారు ప్రముఖంగా ప్రస్తావించారు.  

        "మా రాజకీయ మరియు దౌత్య ఒప్పందాలు మాకు అత్యంత సన్నిహితమైనవి మరియు అత్యంత విశ్వసనీయమైనవి. మా రక్షణ మరియు భద్రతా భాగస్వామ్యం బలంగా ఉంది. అది  సముద్రగర్భం నుండి రోదసి వరకు విస్తరించింది.  మా ఆర్థిక సంబంధాలు రెండు దేశాలకు  శ్రేయోదాయకంగా ఉండి సుసంపన్నం చేస్తాయి.  దేశ  సార్వభౌమాధికారాని  బలోపేతం చేస్తాయి. సరఫరా శృంఖలలను ముందుకు తీసుకువెళతాయి. పరిశుభ్రమైన  మరియు తక్కువ కర్బనం ఉన్న శక్తిని ప్రోత్సహించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, మహా సముద్రాలను  రక్షించడం, కాలుష్యాన్ని ఎదుర్కోవడం సహకారానికి కీలకమైన స్తంభం. మా రెండు దేశాలలో అంకాత్మక, వినూత్న  మరియు అంకుర సంస్థల భాగస్వామ్యమే  కొత్త వృద్ధి రంగమని,  అది రెండు దేశాల  మధ్య లోతైన ఏకముఖత్వము మరియు బలమైన పూరకాలను నిర్మించగలదు" అని  ఇరువురు నేతలు అంగీకరించారు.  

       విద్య, విజ్ఞానం మరియు సాంకేతికత, సంస్కృతి రంగాలలో రెండు దేశాల మధ్య  పెరుగుతున్న సంబంధాలు,  వృద్ధి చెందుతున్న యువత  మార్పిడి మరియు   అత్యంత నిష్ణాతులైన అభివృద్ధి చెందుతున్న వలస వెళ్లిన  ప్రవాసులతో (డియాస్పోరా) సంబంధాలు మరింత బలపడుతున్నాయి.  తద్వారా వారు మన ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.  అవి భవిష్యత్ భాగస్వామ్యానికి బీజాలు వేస్తున్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.  

        అల్లకల్లోలం, సవాళ్లతో కూడిన ప్రస్తుత తరుణంలో  మన భాగస్వామ్యానికి గతంలో కంటే ఎక్కువ ఆవశ్యకత ఉంది.
అంతర్జాతీయ చట్టానికి సమర్ధన, ముక్కలు ముక్కలైన  ప్రపంచంలో సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లడం; బహుపాక్షిక వ్యవస్థ సంస్కరణ, పునరుత్తేజం/పునరుద్ధరణ; సురక్షితమైన, శాంతియుతమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం  నిర్మించడం; వాతావరణ మార్పు, పరిశుభ్రమైన ఇంధనం, ఆరోగ్యం, ఆహార భద్రత, పేదరికం మరియు అభివృద్ధి వంటి  ప్రపంచ సవాళ్లకు  పరిష్కారం కనుగొనడం.

        "భారత స్వాతంత్య్ర శతాబ్ది, మా  దౌత్య సంబంధాల శతాబ్ది మరియు మా వ్యూహాత్మక భాగస్వామ్యం అర్ధ శతాబ్దాన్ని మేము  ధైర్యమైన దార్శనికతతో , ఉన్నత ఆశయాలతో కలిసికట్టుగా  రాబోయే 25 సంవత్సరాలు  అంటే  2047 దాకా ఆ తరువాత
కూడా  కొనసాగే  మా ప్రయాణం కోసం ఈరోజు మేము ఎదురు చూస్తున్నాం" అని ఇద్దరు నేతలు ప్రకటించారు.  

        రానున్న  25 సంవత్సరాలు రెండు దేశాలకు మరియు మన మధ్య భాగస్వామ్యానికి- మన ప్రజలకు మరియు మనతో పాటు ఈ గ్రహంలో నివసించే వారికి  వారికి మంచి భవిష్యత్తును నిర్మించడానికి కీలకమైన సమయం.  భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం తదుపరి దశ కోసం తమ  భాగస్వామ్య దృక్పథాన్ని నిర్దేశించడానికి,  ఇండో-ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం సందర్భంగా "దిక్చక్రం 2047   --  భారత్ - ఫ్రాన్స్ సంబంధాలు శతాబ్ధి దిశగా పయనం" మార్గనిర్దేశం (రోడ్ మ్యాప్)  అమలుకు ఇరువురు నేతలు అంగీకరించారు.


దిక్చక్రం 2047 రోడ్ మ్యాప్, విస్తృత శ్రేణి క్షేత్రాలకు సంబంధించిన పరిణామాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.



 

***


(Release ID: 1940379)