కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇఎస్ఐ పథకం కింద మే 2023లో కొత్తగా 20.23 లక్షల మంది ఉద్యోగుల నమోదు
కొత్త నమోదులలో 9.40 లక్షల మంది 25 ఏళ్ళ వరకు వయసు ఉన్న యువ ఉద్యోగులు
ఇఎస్ఐ పథకం కింద మే 2023న దాదాపు 24,886 నూతన సంస్థల నమోదు
దాదాపు 71 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు మే 2023లో ఇఎస్ఐ ప్రయోజనాల విస్తరణ
Posted On:
17 JUL 2023 4:14PM by PIB Hyderabad
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి - ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్) తాత్కాలిక వేతన పట్టిక డాటా ప్రకారం మే 2023లో సుమారు 20.23 లక్షల మంది నూతన ఉద్యోగులను అందులో జోడించడం జరిగింది.
దాదాపు 24,886 కొత్త సంస్థలను నమోదు చేసి మే 2023 నెలలో రాష్ట్ర బీమా కార్పొరేషన్ సామాజిక భద్రతా గొడుకు కిందకు తీసుకురావడం ద్వారా పరిధిని మరింత విస్త్రతం చేశారు.
కొత్త రిజిస్ట్రేషన్‌ల ద్వారా యువతకు మరిన్ని ఉద్యోగాలను సృష్టించారని మే 2023 నెలలో జోడించిన మొత్తం 20.23 లక్షల మంది ఉద్యోగులలో 9.40 లక్షల మంది ఉద్యోగులు 25 ఏళ్ళ వరకు ఉన్నవారు ఉన్నారని డేటా స్పష్టం చేస్తోంది. మొత్తం ఉద్యోగులలో వీరి శాతం 47%గా ఉంది.
వేతన డాటా జెండర్ వారీ విశ్లేషణ ప్రకారం మే, 2023నెలలో నికరంగా 3.96 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే, మొత్తం 71 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులను కూడా ఇఎస్ఐ పథకం కింద మే 2023లో నమోదు చేశారు. ఇఎస్‌సిఐసి సమాజంలోని ప్రతివర్గానికి తన ప్రయోజనాలను అందించేందుకు కట్టుబడి ఉందని ఇది పట్టి చూపుతోంది.
వేతన పట్టిక డాటా తాత్కాలికం, ఎందుకంటే ఈ డాటా ఉత్పాదన అనేది నిరంతరం కొనసాగే విన్యాసం.
***
(Release ID: 1940262)
Visitor Counter : 169