ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్- యు ఎ ఇ : వాతావరణ మార్పుపై సంయుక్త ప్రకటన

Posted On: 15 JUL 2023 6:16PM by PIB Hyderabad

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యుఎన్ ఎఫ్ సిసిసి) , పారిస్ ఒప్పందం కింద మౌలిక సూత్రాలు , బాధ్యతలను గౌరవిస్తూ, అంతర్జాతీయ సమిష్టి కార్యాచరణ ద్వారా వాతావరణ మార్పు ప్రపంచ సవాలును పరిష్కరించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించారు. వాతావరణ ఆకాంక్ష, డీకార్బనైజేషన్, క్లీన్ ఎనర్జీ పై సహకారాన్ని పెంపొందించడానికి,  యుఎన్ ఎఫ్ సిసిసి పార్టీల 28 వ సమావేశం నుండి స్పష్టమైన,  అర్థవంతమైన ఫలితాలను పొందడానికి కలిసి పనిచేయడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

2023లో కాప్ 28కు ఆతిథ్య దేశంగా ఎంపికైన యు ఎ ఇ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. కాప్ 28 ప్రెసిడెన్సీ చేపడుతున్న సందర్భంగా యు ఎ ఇ కి నరేంద్ర మోదీ  పూర్తి మద్దతును ప్రకటించారు. బదులుగా జి -20లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ కు అభినందనలు తెలిపారు.

 

పారిస్ ఒప్పందం దీర్ఘకాలిక లక్ష్యాలను పరిరక్షించడానికి జాతీయంగా నిర్ణయించిన బాధ్యతలను నెరవేర్చడం,  సంఘీభావం , మద్దతును ప్రదర్శించడం ద్వారా ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఇరువురు నాయకులు అంతర్జాతీయ సమాజానికి అత్యవసర  పిలుపునిచ్చారు. యుఎన్ఎఫ్ సిసిసి,  పారిస్ ఒప్పందంలో పేర్కొన్న సూత్రాలు,  నిబంధనలను గట్టిగా సమర్థిస్తూ, సమానత్వ సూత్రాలు ఉమ్మడి అయినా భిన్నమైన బాధ్యతలు , సంబంధిత సామర్థ్యాలతో సహా, ప్రతి దేశ విభిన్న జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది.

 

ప్రపంచ వాతావరణ చర్య కు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాల పై కాప్ 28 లో  ప్రతిష్టాత్మక, సమతుల్య , అమలు-ఆధారిత ఫలితాలను సాధించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు; అంటే వాతావరణ ఫైనాన్స్ తో సహా ఉపశమనం, అనుసరణ, నష్టం , ధ్వంసం ఇంకా అమలు మార్గాలు. ఈ ఫలితాల సాధనలో అన్ని పార్టీలు నిర్మాణాత్మకంగా పాల్గొని సంఘీభావాన్ని ప్రదర్శించాలని నేతలు పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా, గ్లోబల్ స్టాక్ టేక్ (జిఎస్ టి) ప్రాముఖ్యతను , పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ సమిష్టి కార్యాచరణ  పరిశీలన కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం సిఓపి 28 లో దాని విజయవంతమైన ముగింపును ఇరువురు నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు.  కాప్ 28 వద్ద గ్లోబల్ స్టాక్ టేక్ సమతుల్య విధానాన్ని అమలు చేయడం ప్రాముఖ్యతను వారు నొక్కిచెప్పారు.  అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ఆర్థిక , మద్దతు సమీకరణతో సహా తమ జాతీయ కట్టుబాట్లను బలోపేతం చేయడానికి జిఎస్ టి ఫలితాలను ఉపయోగించుకోవాలని దేశాలకు పిలుపునిచ్చారు. కన్వెన్షన్, పారిస్ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వడంలో అంతర్జాతీయ సహకారం ఆవశ్యకతను కూడా వారు నొక్కి చెప్పారు.

 

వాతావరణ ప్రభావాల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అనుసరణ సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆహార వ్యవస్థలను మార్చడం, నీటి నిర్వహణ, మడ అడవులతో సహా సహజ కార్బన్ సింక్ లను రక్షించడం, జీవవైవిధ్య పరిరక్షణ,  సుస్థిర వినియోగం , ప్రజారోగ్యాన్ని రక్షించడం వంటి కీలక రంగాలపై దృష్టి సారించి, అనుసరణపై ప్రపంచ లక్ష్యాన్ని (జిజిఎ) అభివృద్ధి చేయడంలో స్థిరమైన పురోగతి అనివార్యమని తెలిపారు.

 

పారిస్ ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా వాతావరణ మార్పుల అత్యంత ప్రతికూల ప్రభావాలకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి డుర్బల సమాజాలకు మద్దతు ఇవ్వడంలో అంతర్జాతీయ సహకారం ఆవశ్యకతను ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.

ఈ విషయంలో, నష్టం , ధ్వంసం సమస్యలపై స్పందించే ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఇరువురు నాయకులు వివరించారు. సిఓపి 28 చేసిన నష్టం , ధ్వంసం సహాయ నిధి , నిధుల ఏర్పాట్లను అమలు చేయాలని పార్టీలను కోరడం ద్వారా వాతావరణం యొక్క ప్రతికూల ప్రభావాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు తెలియచేశారు.

 

పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వినియోగం , నిల్వ సాంకేతికతలు, ఇంధన సామర్థ్యం , ఇతర తక్కువ కార్బన్ పరిష్కారాలలో పెట్టుబడులు స్థిరమైన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి,  ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ఉద్గారాలను సమర్థవంతంగా పరిష్కరించడానికి,  తగ్గించడానికి అన్ని సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇవ్వడం , మోహరించడం ఆవశ్యకతను నాయకులు నొక్కి చెప్పారు, అదే సమయంలో సమగ్ర సుస్థిర అభివృద్ధికి దోహదపడే న్యాయమైన మార్పును నిర్ధారిస్తారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం లభ్యత,ప్రవేశం,అందుబాటును నిర్ధారించే దిశగా ప్రయత్నాలను రెట్టింపు చేయాలని ఇరువురు నేతలు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

 

వాతావరణ మార్పుల చట్రంలో న్యాయమైన ఇంధన మార్పు ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు నొక్కిచెప్పారు, ఇది మూడు సమాన ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంది: ఇంధన భద్రత , ప్రాప్యత, ఆర్థిక శ్రేయస్సు , గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ఇవన్నీ న్యాయమైన సమానమైన పద్ధతిలో సాధించబడ్డాయి.

మిలియన్ల మంది వ్యక్తులకు ఇంధనం  అందుబాటులో లేదని గుర్తించి, విస్తృతమైన తక్కువ-కార్బన్ అభివృద్ధి పథంలో అంతర్భాగంగా అందరికీ సరసమైన, విశ్వసనీయమైన , స్థిరమైన ఇంధనాన్ని అందించేందుకు యుఎఇ, భారతదేశం నిస్సందేహంగా మద్దతు ఇస్తాయని వారు పునరుద్ఘాటించారు.

 

అభివృద్ధి చెందిన దేశాలు 100 బిలియన్ డాలర్ల సహాయం అందించే ప్రణాళికను నెరవేర్చాల్సిన తక్షణ అవసరాన్ని ఇరువురు నాయకులు నొక్కిచెప్పారు, తద్వారా 2023 లో లక్ష్యాన్ని చేరుకోవచ్చు, నమ్మకాన్ని పెంపొందించడానికి ,వాతావరణ ప్రభావాలకు ప్రతిస్పందనగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక ప్రాప్యత , స్థోమతకు మద్దతు ఇవ్వాలని కోరారు.  యుఎన్ఎఫ్ సిసిసి, పారిస్ ఒప్పందం కింద ఉన్న బాధ్యతలను వారు గుర్తు చేశారు. 2019 స్థాయి నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుగుణంగా వాతావరణ నిధులను 2025 నాటికి రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకోవాలని దేశాలకు పిలుపునిచ్చారు.

 

అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులను పరిష్కరించే లక్ష్యంతో జాతీయంగా నిర్ణయించిన ప్రణాళికలకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక యంత్రాంగాలను సంస్కరించడం, రాయితీ ఫైనాన్స్ ను. అన్ లాక్ చేయడం, రిస్క్ నిర్వహణ , అదనపు ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు (ఐఎఫ్ఐలు) ,  బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులు (ఎండిబిలు) ఈ సంవత్సరం స్పష్టమైన పురోగతిని సాధించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఎండిబిలు 21 వ శతాబ్దం భాగస్వామ్య ప్రపంచ సవాళ్లను పరిష్కరించగలగాలని, అభివృద్ధి సాయం లో వారి పాత్ర తో రాజీపడకుండా ప్రపంచ ప్రజా వస్తువులకు ఫైనాన్స్ చేయగలగాలని పేర్కొన్నారు.

 

వ్యక్తుల స్థిరమైన , పర్యావరణ- స్నేహపూర్వక మార్పులను ప్రవర్తనలను పెద్ద ఎత్తున లెక్కించినప్పుడు, ప్రపంచ వాతావరణ చర్యకు గణనీయమైన దోహదం చేస్తాయని ఇరువురు నాయకులు అంగీకరించారు. సుస్థిర జీవనశైలిపై అవగాహనను పెంపొందించడం, పర్యావరణ అనుకూల ఎంపికలు, మార్పులను స్వీకరించడానికి వ్యక్తులను ప్రోత్సహించ వలసిన అవసరాన్ని వారు గుర్తించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన మిషన్ ఎల్ఐఎఫ్ఇ కార్యక్రమాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు. పర్యావరణం కోసం సరైన ఎంపికలు చేయడానికి సిఓపి 28 ఎజెండా ప్రజల్లో ఈ అవగాహనను ప్రోత్సహిస్తుందని ఇరువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

భారతదేశ  జి 20 అధ్యక్ష పదవి ప్రాముఖ్యత , ప్రాధాన్యత లను ఇరువురు నాయకులు ధృవీకరించారు. ఆర్థిక , సాంకేతిక పరిజ్ఞానానికి కీలకమైన సాధనాలుగా గుర్తిస్తూ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించడానికి , వేగవంతం చేయడానికి జి 20 పాత్రను ధృవీకరించారు, అలాగే న్యాయమైన, సమ్మిళిత , సుస్థిర ఇంధన మార్పులపై దృష్టి సారించారు.

 

మెరుగైన అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, అనుభవాలు , విజ్ఞానాన్ని పంచుకోవడం ఇంకా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి సృజనాత్మక, సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించడంలో యుఎఇలో నిర్వహించిన సిఓపి 28 కీలక ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు గుర్తించారు.

 

యు ఎన్ ఎఫ్ సిసిసి , పారిస్ ఒప్పందం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి సమర్థవంతమైన వాతావరణ చర్య,  అంతర్జాతీయ సహకారానికి కొత్త వేగాన్ని సృష్టించే సమ్మిళిత , కార్యాచరణ- ఆధారిత సమావేశంగా సిఓపి 28 లో విజయవంతమైన ఫలితాన్ని నిర్ధారించడానికి యుఎఇ , భారతదేశం ఐక్యంగా ఉన్నాయి.

 

***



(Release ID: 1940063) Visitor Counter : 160