రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వరద ప్రభావిత రాష్ట్రాల్లో ఐఏఎఫ్‌ సహాయక చర్యలు

प्रविष्टि तिथि: 14 JUL 2023 1:45PM by PIB Hyderabad

1. వరద ప్రభావిత హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో 'మానవత సాయం & విపత్తు సహాయ కార్యక్రమాలను' భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) చేపడుతోంది. గత 48 గంటల్లో మొత్తం 40 కార్యకలాపాలు చేపట్టి 126 మందిని రక్షించింది, వివిధ ప్రాంతాల్లో 17 టన్నుల సహాయ సామగ్రిని పంపిణీ చేసింది.

2. గత 24 గంటల్లో, హరియాణాలోని వరద బాధిత ప్రాంతాల్లోనూ సహాయ కార్యకలాపాలు నిర్వహించింది. నిహార, అల్లావుదీన్ మజ్రా, బిషన్‌గఢ్, సెగ్తా, భున్ని, ముమ్ని, సెగ్టి, జాన్సుయ్ గ్రామాలకు ఎం-17 హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, టార్పాలిన్ షీట్లు, తాజా ఆహారం, మంచినీటి బాటిళ్లను అందజేసింది.

3. అవసరమైతే మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు మరికొంత మంది వైమానిక సిబ్బంది, ఎం-17 & చినూక్ హెలికాప్టర్లు, ఏఎన్‌-32 & సి-130 రవాణా విమానాలు సిద్ధంగా ఉన్నాయి.

 

***


(रिलीज़ आईडी: 1939505) आगंतुक पटल : 275
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil