ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ నుప్రధాన మంత్రి కి ఇవ్వడమైంది

Posted On: 13 JUL 2023 11:55PM by PIB Hyderabad

ఫ్రాన్స్ లో అత్యున్నత పురస్కారం ‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజన్ ఆఫ్ ఆనర్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఈ రోజు న ప్రదానం చేశారు.

ఈ విశిష్ట సమ్మానాని కి గాను అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ కు భారతదేశం ప్రజల పక్షాన ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

ఈ పురస్కార ప్రదాన సంబంధి కార్యక్రమం పేరిస్ లోని ఎలిసీ పేలెస్ లో జరిగింది.

 

***

 


(Release ID: 1939490) Visitor Counter : 200