చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రిక సమాచారం
Posted On:
13 JUL 2023 10:36AM by PIB Hyderabad
12.07.2023 నాడు జారీ చేసిన ప్రకటన ప్రకారం, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సరస వెంకటనారాయణ భట్టిని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124లోని 2వ క్లాజ్ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఈ నియామకాలు చేశారు. ఈ న్యాయమూర్తులు తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి నియామకం అమలులోకి వస్తుంది.
*******
(Release ID: 1939183)
Visitor Counter : 175