ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 14 జులై 2023న స్వాస్థ్య చింతనశిబిరాన్ని ప్రారంభించనున్న కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ
స్వాస్థ్య చింతన శిబిరానికి హాజరు కానున్న కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భారతి ప్రవీన్ పవార్, ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బఘేల్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ఆరోగ్య మంత్రులు
Posted On:
12 JUL 2023 2:16PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 14 జులై, 2023న నిర్వహిస్తున్న స్వాస్థ్య చింతన్ శిబిరాన్ని కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కేంద్ర కౌన్సిల్ తో కలిసి ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రెండు రోజుల స్వాస్థ్య చింతన్ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బఘేల్ కూడా హాజరు కానున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు, ఆరోగ్య మంత్రిత్వ శాఖల సహా సీనియర్ అధికారులు కూడా ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ రెండు రోజుల కార్యక్రమం ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కేంద్ర కౌన్సిల్ 14 సదస్సుకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (తీసుకున్నచర్యలకు సంబంధించిన నివేదిక)ను ప్రవేశపెట్టడంతో ప్రారంభం అవుతుంది. నేడు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వివిధ కోణాలపై దృష్టి పెట్టిన సెషన్లు తదనంతరం ప్రారంభం అవుతాయి. ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పిఎంజెఎవై), ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం), ఆరోగ్య, వెలనెస్ కేంద్రాలు సహా ఆయుష్మాన్ భారత్‌కు సంబంధించిన నాలుగు అంశాలను పట్టి చూపడంతో పాటుగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎం- ఎబిహెచ్ఐఎం - ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్)ను కూడా సెషన్లు పట్టి చూపనున్నాయి.
ఈ ఇతివృత్తంతో కూడిన సెషన్లు జాతీయ ట్యూబర్‌క్యులోసిస్ నిర్మూలన కార్యక్రమం, మశూచి నిర్మూలన, రుబెల్లా, పిసిపిఎన్‌డిటి చట్టాన్ని భారత్‌లో అమలు పై దృష్టి పెట్టనున్నాయి.
దేశంలో వైద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య విద్య స్థితిగతులను, ప్రజారోగ్య నిర్వహణ క్యాడర్ పాత్రను సెషన్లు పట్టి చూపుతాయి.
జాతీయ అవవయవ మార్పిడి కార్యక్రమంతో పాటుగా జిల్లా రెసిడెన్సీ కార్యక్రమంపై కూడా చర్చలు జరుగుతాయి. అదనంగా, సెషన్లు సంక్రమించని వ్యాధుల భారం, సికిల్ సెల్ వ్యాధిపై దృష్టి పెడతాయి.
దేశంలో ఎదురవుతున్న ఆరోగ్య సంరక్షణ సవాళ్ళను పరిష్కరించడం, ఆరోగ్యవంతమైన దేశాన్ని సృష్టించేందుకు అవకాశాలను రాబట్టడంపై స్వాస్థ్య చింతన్ శిబిరంలో వాటాదారులతో ముఖాముఖి సంభాషణ సెషన్లు ఉంటాయి.
***
(Release ID: 1939110)
Visitor Counter : 153