రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
2025 జనవరి 1 నుంచి ఉత్పత్తి చేసే ఎన్2, ఎన్3 విభాగం మోటారు వాహనాల క్యాబిన్లలో తప్పనిసరిగా శీతలీకరణ వ్యవస్థ అమర్చాలంటూ ముసాయిదా ప్రకటన జారీ
Posted On:
11 JUL 2023 4:42PM by PIB Hyderabad
2025 జనవరి 1 నుంచి ఉత్పత్తి చేసే ఎన్2, ఎన్3 విభాగం మోటారు వాహనాల క్యాబిన్లలో తప్పనిసరిగా శీతలీకరణ వ్యవస్థ అమర్చాలంటూ, కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన ముసాయిదా ప్రకటన జారీ అయింది.
ఐఎస్ 14618: 2022కు అనుగుణంగా శీతలీకరణ వ్యవస్థ ఉండాలి, ఈ ప్రమాణాన్ని కాలానుగుణంగా మారుస్తారు. ఈ ప్రకటనపై ఏవైనా సూచనలు/సలహాలు ఇవ్వాలనుకుంటే, ప్రకటన జారీ తేదీ నుంచి 30 రోజుల లోపు వాటిని comments-morth[at]gov[dot]in అడ్రస్‌కు ఈ-మెయిల్ చేయవచ్చు.
గెజిట్ నోటిఫికేషన్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1938796)
Visitor Counter : 153