మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మహాబలిపురంలో ముగిసిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవం - 2023
చేపల పెంపకందారుల అంకితభావం, స్టార్టప్ లు, ఆధునిక పద్ధతులను అవలంబించడంలో నూతన ఆవిష్కరణలు, చేపల ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి అంశాలను
ఆవిష్కరించిన ఉత్సవం
Posted On:
11 JUL 2023 5:02PM by PIB Hyderabad
కొన్నేళ్లుగా, శాస్త్రీయ పరిశోధన , సాంకేతిక జోక్యాలతో మత్స్య రంగం గణనీయమైన పురోగతిని సాధించింది. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం (నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేమీట్) -2023 లో చేపల పెంపకందారుల అంకితభావం, స్టార్టప్ లు, ఆధునిక పద్ధతులను అవలంబించడంలో నూతన ఆవిష్కరణలు, చేపల ఉత్పాదకతను పెంపొందించడం వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఇతర భాగస్వాములు మహాబలిపురంలో జాతీయ మత్స్య రైతుల దినోత్సవం 2023, 'స్టార్టప్ కాన్ క్లేవ్ ‘ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 2023 జూలై 10 న ప్రారంభమై 2023 జూలై 11 న తమిళనాడులోని చారిత్రాత్మక నగరం మహాబలిపురంలో ముగిసింది.
జాతీయ మత్స్య రైతుల దినోత్సవం-2023 సందర్భంగా మత్స్యకారులు, చేపల పెంపకందారుల అపారమైన కృషిని, సుస్థిర మత్స్యాభివృద్ధికి వారి అంకితభావాన్ని గుర్తించడానికి యావత్ దేశానికి అవకాశం లభించింది. బాధ్యతాయుతమైన పద్ధతులను అవలంబించడం ద్వారా, మత్స్య రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, మనం సుసంపన్నమైన భవిష్యత్తును నిర్ధారించవచ్చు, ఆహార భద్రతను పెంచవచ్చు. ఇంకా దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడవచ్చు. మన మత్స్య వనరులను సుస్థిరంగా నిర్వహించే మార్గాలను సమిష్టిగా ఆలోచించడానికి, చర్చించడానికి ఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఈ సమావేశాన్ని జరుపుకోవడం లోని ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమం రెండవ రోజున కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా, మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సమక్షంలో ప్రారంభమైంది, మత్స్యకారులు, చేపల రైతుల, భాగస్వాముల సుస్థిర భవిష్యత్తు కోసం సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను స్వీకరించడంతో సహా చేపల పెంపకం కోసం పిఎమ్ఎమ్ఎస్ వై, ఎఫ్ఐడిఎఫ్ , కెసిసి వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం గురించి సంబంధిత రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో వారు సంభాషించారు. చేపల పెంపకానికి సంబంధించిన భాగస్వాములందరు పాల్గొనడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
శ్రీ పురుషోత్తం రూపాలా అందరూ కలిసి ప్రారంభించిన అద్భుతమైన ప్రయాణాన్ని వివరిస్తూ ముగింపు ప్రసంగం చేశారు.
జాతీయ చేపల రైతుల దినోత్సవ సమావేశం-2023 లో వ్యక్తమైన ఆలోచనల గురించి ఆయన వివరించారు. ఈ చర్చ మరింత విస్తరించి ఫలాలను ఇస్తుందని, ఇది మన సమిష్టి ప్రయాణ గమనాన్ని నిర్దేశించే స్పష్టమైన ఫలితాలకు దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ సమావేశం లో జరిగిన కార్యక్రమం చర్చలు విస్తృతంగా ప్రతిధ్వనిస్తాయి. అవన్నీ చేపల పెంపకందారులు , మత్స్యకారుల జీవితాన్ని ప్రభావితం చేసే కార్యకలాపాలుగా మారేలా చూడటం మన సమిష్టి బాధ్యత‘ అన్నారు. మత్స్యకారులు, చేపల పెంపకందారులకు తోడ్పడే ఆలోచనలు, సహకారాలు , నూతన ఆవిష్కరణలు వృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ, కేంద్ర మంత్రి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారత మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి (ఐఎఫ్) శ్రీ సాగర్ మెహ్రా వందన సమర్పణ చేస్తూ, ఉత్సాహంగా పాల్గొన్న అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం, నాణ్యతను మెరుగుపరచడం, దేశీయ చేపల వినియోగం, ఎగుమతులు పెంచడం, వాణిజ్యం, వ్యర్థాలను తగ్గించడం, తద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభించాలని మత్స్య రంగం ఉద్దేశిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం, నీలి విప్లవం, పీఎంఎంఎస్ వై వంటి పథకాలతో మత్స్య రంగంలోని ప్రజలకు చర్చకు వేదికను అందించడానికి ఉద్దేశించబడింది, ఇవి మత్స్య రంగాన్ని మార్చడానికి , స్థిరమైన వృద్ధి , అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ లక్షలాది జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి.
మత్స్యరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ వృద్ధికి దోహదపడే అన్ని రంగాల భాగస్వామ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం, వ్యాపార నమూనాల అభివృద్ధి, సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, ఆవిష్కరణలు, స్టార్టప్ లు, ఇంక్యుబేటర్లు వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా చేపల పెంపకంలో సరికొత్త ఆవిష్కరణలను చేర్చాలని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
అంతకు ముందు జాతీయ చేపల రైతుల దినోత్సవం-2023 మొదటి రోజు ప్రారంభ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల ఆ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్, డాక్టర్ ఎల్. మురుగన్, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మత్స్యశాఖ మంత్రుల సమక్షంలో నిర్వహించారు. నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే మీట్ - 2023 , స్టార్టప్ కాన్ క్లెవ్ భారతీయ మత్స్య రంగం గుర్తించదగిన విజయాలను హైలైట్ చేయడానికి వేదికలుగా పనిచేశాయి, అదే సమయంలో పరిశ్రమలో సృజనాత్మకత , వ్యవస్థాపకతను ప్రోత్సహించాయి. మత్స్య రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ లు తమ సృజనాత్మక ఆలోచనలు, ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి 'స్టార్టప్ కాన్ క్లేవ్ ' ప్రత్యేక వేదికను కల్పించింది.
***
(Release ID: 1938795)
Visitor Counter : 189