అణుశక్తి విభాగం
యూఏఈలో జరిగిన 34వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారతదేశం
प्रविष्टि तिथि:
11 JUL 2023 1:50PM by PIB Hyderabad
యూఏఈలో 2023 జూలై మూడు నుంచి 11 వరకు జరిగిన 34వ ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ (ఐబీఓ)లో పతకాల పట్టికలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థి బంగారు పతకాన్ని సాధించడం విశేషం!. పాల్గొన్న అన్ని విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం, పతకాల పట్టికలో అగ్రస్థానంలో భారతదేశం నిలవడం ఇదే తొలిసారి.
ఈ సంవత్సరం పతకాలు సాధించిన విద్యార్థులు:
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ధ్రువ్ అద్వానీ ( స్వర్ణం).
రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఇషాన్ పెడ్నేకర్ ( స్వర్ణం).
మహారాష్ట్రలోని జల్నాకు చెందిన మేఘ్ చబ్దా ( స్వర్ణం).
ఛత్తీస్‌గఢ్‌లోని రిసాలీకి చెందిన రోహిత్ పాండా ( స్వర్ణం). .
భారత బృందానికి ప్రొఫెసర్ మదన్ ఎం. చతుర్వేది (మాజీ సీనియర్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ), డాక్టర్ అనుపమ రోనాద్ (హెచ్బిసిఎస్ఈ, టీఐఎఫ్ఆర్ ) నాయకత్వం వహించారు. శాస్త్రీయ పరిశోధకులుగా డాక్టర్ వి.వి. బినోయ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, బెంగళూరు) మ డాక్టర్ రంభదూర్ సుబేది (ఎన్ఐఆర్ఆర్హెచ్ , ముంబై).పాల్గొన్నారు.
ఈ ఏడాది జరిగిన ఐబీఓ లో 76 దేశాలకు చెందిన 293 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నాలుగు బంగారు పతకాలు సాధించిన మరో దేశం సింగపూర్ మాత్రమే. మొత్తం 29 బంగారు పతకాలు ప్రదానం చేశారు.
అంతకుముందు, భారతదేశం ఖగోళ శాస్త్రం ఖగోళ భౌతిక శాస్త్రంలో (2008, 2009, 2010, 2011, 2015 మరియు 2021లో), భౌతికశాస్త్రం (2018) , జూనియర్ సైన్స్ (2014, 2012, 20219, 2021, 2021లో) పతకాల పట్టికలో అగ్రస్థానం సాధించింది.
***
(रिलीज़ आईडी: 1938732)
आगंतुक पटल : 289