సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని హంపిలో జీ20 సాంస్కృతిక అధ్యయన బృందం ( కల్చర్ వర్కింగ్ గ్రూప్ - సీడబ్ల్యూజి ) మూడో సమావేశం ప్రారంభం


వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో అమెరికా నుంచి 150 పురాతన వస్తువులు/ కళాఖండాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది: శ్రీ గోవింద్ మోహన్

అతిపెద్ద లంబానీ ఎంబ్రాయిడరీ ప్యాచెస్ ప్రదర్శనను సృష్టించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ప్రవేశించాలని సిడబ్ల్యుజి లక్ష్యంగా పెట్టుకుంది

ఈ సమావేశం సందర్భంగా విజయ విఠల ఆలయం, హంపిలోని రాయల్ ఎన్ క్లోజర్ ను సందర్శించనున్న జీ20 ప్రతినిధులు

Posted On: 09 JUL 2023 7:20PM by PIB Hyderabad

కర్ణాటకలోని హంపిలో జీ20 కల్చర్ గ్రూప్ (సీడబ్ల్యూజీ) మూడో సమావేశం ఆదివారం నుంచి ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ హంపిలో మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ జి 20 అధ్యక్షతన 3 వ సాంస్కృతిక కార్యవర్గ సమావేశం జూలై 9 నుండి 12 వరకు కర్ణాటకలోని హంపిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

ఈ సమావేశానికి జీ20 సభ్యదేశాలు, అతిథి దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.

 

తొలి రెండు సీడబ్ల్యూజీ సమావేశాలు ఖజురహో, భువనేశ్వర్ లలో జరిగాయని ఆయన తెలిపారు. హంపిలో జరుగుతున్న మూడో సమావేశంలో జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ఏడు బహుళపక్ష సంస్థల నుంచి సుమారు 50 మంది పాల్గొంటున్నారు. నిపుణులతో నాలుగు గ్లోబల్ థీమాటిక్ వెబినార్ లను నిర్వహించామని, మొత్తం 29 దేశాలు, ఏడు బహుళపక్ష సంస్థలు వెబినార్ లలో పాల్గొనడంతో ఇవి విజయవంతమయ్యాయని ఆయన తెలిపారు. 

 

సిడబ్ల్యుజి నాలుగు ప్రాధాన్యతలకు సంబంధించి మొదటి రెండు సమావేశాలలో పంచుకున్న సిఫార్సులు,  ఉత్తమ పద్ధతులపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి మూడవ సిడబ్ల్యుజి సమావేశం ఇప్పుడు ప్రయత్నిస్తుందని శ్రీ గోవింద్ మోహన్ అన్నారు. కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు భారతదేశ జి 20 ప్రెసిడెన్సీ సమయంలో సాంస్కృతిక పరంగా (కల్చర్ ట్రాక్ )వివరించిన 4 ప్రధాన ప్రాధాన్య రంగాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని ఆయన తెలియజేశారు. 4 ప్రాధాన్యతా రంగాలు: సాంస్కృతిక సంపద పరిరక్షణ-  పునరుద్ధరణ; సుస్థిర భవిష్యత్తు కోసం జీవన వారసత్వాన్ని ఉపయోగించు కోవడం;  సాంస్కృతిక,  సృజనాత్మక పరిశ్రమలు , సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం; సంస్కృతి పరిరక్షణ , ప్రోత్సాహం కోసం డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం.

 

ఆగస్టులో వారణాసిలో జరిగే సాంస్కృతిక మంత్రిత్వ (మినిస్టీరియల్) స్థాయి సమావేశానికి సభ్యదేశాల ఉమ్మడి ప్రకటనను రూపొందించడంపై దృష్టి సారించినట్లు కూడా శ్రీ గోవింద్ మోహన్ తెలిపారు.

 

'సాంస్కృతిక ఆస్తుల పరిరక్షణ, పునరుద్ధరణ' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ,  1970 నాటి యునెస్కో సదస్సు వలసవాద దోపిడీ కారణంగా లేదా స్మగ్లింగ్, దొంగతనం వంటి వలసవాద అనంతర దుర్వినియోగం కారణంగా ఇతర దేశాలకు చెందిన కళాఖండాలను స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలని సంతకం చేసిన దేశాలను ఆదేశిస్తోందన్నారు. భారత్ కు ప్రయోజనం చేకూర్చే ఈ ఒప్పందంపై జీ-20 దేశాలన్నీ సంతకాలు చేయాలని సమావేశాల్లో ప్రయత్నం జరుగుతోందన్నారు. 

 

ద్వైపాక్షికంగా కూడా భారతదేశం ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ పర్యటన సంయుక్త ప్రకటనలో ఇది కనిపిస్తోందని ఆయన తెలియజేశారు. భారత్, అమెరికాల మధ్య కల్చరల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ ద్వారా స్మగ్లింగ్ వస్తువులు, కళాఖండాలను అడ్డుకుని వాటిని త్వరితగతిన తిరిగి ఇచ్చేయడానికి అమెరికా అధికారులకు వీలవుతుంది.

వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో అమెరికా నుంచి సుమారు 150 కళాఖండాలు వచ్చే అవకాశం ఉందన్నారు.

 

'సుస్థిర భవిష్యత్తు కోసం లివింగ్ హెరిటేజ్ ను ఉపయోగించుకోవడం' అనే రెండో థీమ్ పై ఆయన మాట్లాడుతూ , స్థానిక ప్రజల హక్కులను మెరుగుపరచడం, సంప్రదాయ పద్ధతుల దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించడం ఈ థీమ్ లక్ష్యమన్నారు. సమాజాలు సజీవ వారసత్వం లో  అనుసరించే ఎటువంటి వ్యాపార మార్గాల ద్వారా నైనా ప్రయోజనం పొందే విధంగా చర్చను కలిగి ఉండటం ఈ థీమ్ లక్ష్యం.

 

సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం అనే మూడో థీమ్ పై ఆయన మాట్లాడుతూ,  సాంస్కృతిక కట్టడాలు, సాంస్కృతిక ప్రదేశాల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవడానికి, ఆ అవగాహన ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి యంత్రాంగాలను రూపొందించడంపై దృష్టి సారిస్తుందని  తెలిపారు.

 

నాలుగో థీమ్ 'కల్చర్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ టెక్నాలజీస్' అనే అంశంపై ఆయన మాట్లాడుతూ,  ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎమర్సివ్స్ ద్వారా యావత్ సాంస్కృతిక ప్రపంచం డిజిటల్ విప్లవానికి లోనవుతోందన్నారు. డిజిటల్ ఉత్పత్తులను సరిహద్దులు దాటి పంచుకునేలా ఇంటర్ ఆపరేబిలిటీని అనుమతించే యంత్రాంగాన్ని రూపొందించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

 

హంపిలో జరుగుతున్న 3వ జీ20 సీడబ్ల్యూజీ సమావేశాల్లో భాగంగా 'వోవెన్ నరేటివ్స్' పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ ఎగ్జిబిషన్ థీమ్ సిడబ్ల్యుజి సూచించిన మూడవ ప్రాధాన్యత - 'సాంస్కృతిక సృజనాత్మక పరిశ్రమలు మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం' పై దృష్టి పెడుతుంది.

ఈ ప్రదర్శన భారతదేశ సృజనాత్మక, భౌగోళిక సందర్భాలలో చేతి నేత పాత్రను వెలుగులోకి తెస్తుంది, తయారీ, వాణిజ్యం, ఉపయోగం సంబంధిత విభిన్న పర్యావరణాలపై దృష్టిని ఆకర్షిస్తుంది.

చూసే ప్రదర్శనలు హస్తకళాకారులు, చేతి వృత్తుల వారు, కళాకారులు డిజైనర్లుగా ప్రాక్టీస్ చేసే వారిచే సృజనాత్మకంగా సృష్టించబడతాయి, ఈ ఎగ్జిబిషన్ జూలై 14 నుంచి ఆగస్టు 14 వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది.

 

మూడవ కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి మొత్తం 20 దేశాలతో పాటు అతిథి దేశాలకు చెందిన 9 చర్చల భాగస్వాములు, ఏడు అంతర్జాతీయ సంస్థలు హాజరవుతున్నాయని సంయుక్త కార్యదర్శి శ్రీమతి లిల్లీ పాండే మీడియాకు వివరించారు.సాంస్కృతిక మంత్రిత్వ స్థాయి ప్రకటన , భాష పై

ఏకాభిప్రాయానికి  రావడమే ఈ సమావేశం లక్ష్యమని ఆమె తెలియజేశారు.

 

ఈ ఏడాది ఆగస్టు 26న వారణాసిలో జరిగే సాంస్కృతిక మంత్రిత్వ స్థాయి సమావేశంలో గ్లోబల్ థీమ్ వెబినార్ ల నివేదికను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. గత సమావేశం నుంచి కార్యాచరణ ఆధారిత స్పష్టమైన ఫలితాలతో కూడిన బలమైన ప్రకటనను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.

 

లంబానీ ఎంబ్రాయిడరీ వర్క్ ఎగ్జిబిషన్ పై శ్రీమతి పాండే మాట్లాడుతూ... లంబానీ ఎంబ్రాయిడరీ ప్యాచెస్ అతిపెద్ద ప్రదర్శనను సృష్టించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలని సిడబ్ల్యుజి లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 'కల్చర్ యునైట్స్ ఆల్' అనే థీమ్ తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించనున్నారు. ఈ ప్రయత్నంలో లంబానీ కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా మహిళా హస్తకళాకారులు పాల్గొంటారు, సండూర్ కుశాల కళా కేంద్రం తో కలసి వారు చేసిన సుమారు 1300 లంబానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్  లను ప్రదర్శిస్తున్నారు.

 

అనేక సాంస్కృతిక అనుభవాలను జాగ్రత్తగా ఎంపిక చేశామని, ప్రతినిధులు తమ పర్యటన అంతటా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆమె తెలియజేశారు.

ఇందులో విజయ విఠల ఆలయం, రాయల్ ఎన్ క్లోజర్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ కు చెందిన ఏడూరు బసవన్న కాంప్లెక్స్ వంటి వారసత్వ ప్రదేశాల సందర్శన ఉంది.

 

తుంగభద్ర నదిలో ప్రసిద్ధి చెందిన కోరకిల్ రైడ్ ను కూడా ప్రతినిధులు ఆస్వాదిస్తారని ఆమె తెలియజేశారు. తోలుబొమ్మలాట, గంజిఫా ఆర్ట్ వర్క్, బిద్రీ ఆర్ట్ వర్క్ , కిన్హాల్ క్రాఫ్ట్ వంటి డిఐవై కార్యకలాపాలను ప్రతినిధులు పాల్గొని ఆనందించడానికి ఏర్పాటు చేశారు. ప్రతినిధుల కోసం వెదురు సింఫనీ బ్యాండ్, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

 

కల్చరల్ వర్కింగ్ గ్రూప్ జి 20 సభ్యదేశాలు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో లోతైన చర్చల సమ్మిళిత ప్రక్రియ ద్వారా పనిచేస్తోంది. ఈ చర్చలు సహకార చర్య కోసం కీలకమైన ప్రాంతాలను పునరుద్ఘాటించడం , సుస్థిర అభివృద్ధి కోసం స్పష్టమైన సిఫార్సులు,  ఉత్తమ పద్ధతులను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

 

***


(Release ID: 1938423) Visitor Counter : 195