శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు బాయీటెక్ అంకుర సంస్థలు కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్


8/9 ఏళ్ళ కిందట 50 బయోటెక్ అంకుర సంస్థలు ఉండగా ఇప్పుడవి 6,000 కు చేరాయి, ఇంకా మనకు అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్



బయోటెక్నాలజీ, బయో ఎకానమీ ప్రాధాన్యాన్ని చెప్పి భారత్ ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చైతన్యవంతం చేశారు: డాక్టర్ జితేంద్ర సింగ్



భారత బయో ఆర్థిక వ్యవస్థ 2014 లో 8 బిలియన్ డాలర్లు, ఇప్పుడు 100 బిలియన్ డాలర్లు, 2025 కు లక్ష్యం 150 బిలియన్ డాలర్లు: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి



“హిమాలయాలు మొదలు సముద్రాల దాకా భారత బయో వనరులు అపారం, వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి”

Posted On: 08 JUL 2023 2:40PM by PIB Hyderabad

బయో టెక్నాలజీ అంకుర సంస్థలు భారతదేశ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి), పీఎంవో సహాయ మంత్రి, అణువిద్యుత్ శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

“8-9 సంవత్సరాల క్రితం మనకు కేవల 50 బయోటెక్ అంకుర సంస్థలు ఉండేవి. ఇప్పుడు అవి 6,000 కు చేరాయి. అయినా సరే ,మనకు ఇంకా అవసరమన్నాడే నా అభిప్రాయం”  అన్నారు. బయోటెక్నాలజీ విభాగం తీసుకుంటున్న బయో మాన్యుఫాక్చరింగ్ చొరవ మీద న్యూ ఢిల్లీలో  జరిగిన సమావేశాన్ని ప్రారంభిస్తూ మంత్రి ప్రసంగించారు.

 

 

బయోటెక్నాలజీబయో ఎకానమీ ప్రాధాన్యాన్ని చెప్పి భారత్ ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  చైతన్యవంతం చేశారని ఈ సందర్భంగా  డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

 “భారత బయో ఆర్థిక వ్యవస్థ విలువ 2014 లో కేవలం 8 బిలియన్ డాలర్లు ఉండేది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ బయో టెక్నాలజీ పట్ల, బయో ఆర్థిక వ్యవస్థ పట్ల కల్పించిన అవగాహనతో చైతన్యవంతమైన దేశం ఇప్పుడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇప్పుడు మన లక్ష్యం 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరటం” అన్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో జోడించబోతున్న విలువ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. మనది ప్రపంచంలో 12 వ రాంకు కాగా ఆసియా పసిఫిక్ లో మూడో స్థానంలోనూ, టీకా మందు  ఉత్పత్తిలో మొదటి స్థానంలోనూ ఉందన్నారు. అంతర్జాతీయ వర్తకంలో కీలకమయ్యే అవకాశం బయోటెక్నాజీకి ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.

 

 

 “భారతదేశానికి బయో వనరుల సంపద చాలా ఎక్కువగా ఉంది. వాడుకోవటానికి సిద్ధంగా ఉన్న వనరులు మనకు ఎంతగానో ప్రయోజనకరం. విస్తృతమైన జీవవైవిధ్యం ఉండటం ఇందుకు ప్రధాన కారణం. హిమాలయాలలో విశిష్టమైన జీవ వనరులున్నాయి. 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. సముద్రగర్భంలో దాగిన జీవ వనరుల వినియోగానికి నిరుడు మనం ‘సముద్రయాన్’ ప్రారంభించాం ” అన్నారు. యువతలో బయోటెక్నాలజీ ఒక ట్రెండింగ్ కెరీర్ అవకాశం గా మారిందని డాక్టర్ జితేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఢిల్లీలోని 12వ తరగతి విద్యార్థులతో సర్వే జరిపినప్పుడు కెరీర్ గా ఈ రంగాన్ని ఎంచుకునే వారి సంఖ్య బాగా పెరిగినట్టు తేలిందన్నారు. మొదటి ఐదు రకాల కెరీర్ లలో నాలుగో స్థానం బయోటెక్నాలజీకి లభించిందన్నారు.  

 

 

ఇంతకు ముందు ఈ రంగం గురించి పెద్దగా తెలియదని, ఇప్పుడిప్పుడే యువతను ఆకర్షిస్తోందని అన్నారు. సింథటిక్ టెక్నాలజీ, జీనోమ్ ఎడిటింగ్, మైక్రోబియల్  బయో రిసోర్సెస్, మెటబాలిక్ ఇంజనీరింగ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారని గుర్తు చేశారు. మరీ ముఖ్యంగా వ్యాధుల నియంత్రణకు సం బంధించిన జెనెటిక్ ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు.

 

 

 

ప్రపంచ జీవ ఉత్పత్తుల దినోత్సవం సందర్భంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ డీబీటీ సోషల్ మీడియా కాంపెయిన్  #IChooseLiFE ను ప్రారంభించారు. దీని ద్వారా జీవ ఉత్పత్తుల తయారీని, జీవ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహిస్తారు.

డీబీటీ కార్యదర్శి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఛైర్మన్   డాక్టర్ రాజేశ్ ఎస్, గోఖలే, బీఐఏఆర్ సి మేనేజింగ్ డైరెక్టర్  డాక్టర్ జితేంద్ర కుమార్,  ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ రమేశ్  వి. శొంటి తదితరులు ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

*****


(Release ID: 1938364) Visitor Counter : 146