రైల్వే మంత్రిత్వ శాఖ

గోరఖ్ పూర్ స్టేషన్ నుంచి రెండు కొత్త ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ రైళ్లను ప్రారంభించిన ప్రధాని


అయోధ్య మీదుగా గోరఖ్ పూర్-లక్నో వందే భారత్, జోధ్ పూర్-అహమ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు; ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 50 వందే భారత్ రూట్లు

ఆ మార్గాలలో ఇప్పుడున్న వేగవంతమైన రైళ్ళకంటే ఈ రైళ్ళ వలన ప్రయాణం సమయం గంటలకొద్దీ తగ్గుదల

అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభవంతో బాటు పర్యాటకాన్ని ప్రోత్సహించనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు

Posted On: 07 JUL 2023 6:32PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ లో రెండు సరికొత్త, అప్ గ్రేడ్ చేసిన వందే భారత్ ఎక్స్ రపేస్ రైళ్ళు ప్రారంభించటంతో భారతీయ రైల్వేలు ఒక చరిత్రాత్మక సందర్భాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగీ ఆదిత్యనాథ్, గోరఖ్ పూర్ ఎంపీ శ్రీ రవి కిషన్ శుక్లా, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.

సౌకర్యవంతమైన రైలు ప్రయాణ అనుభూతికి అవకాశం కల్పిస్తూ అయోధ్య మీదుగా గోరఖ్ పూర్- లక్నో మధ్య ఒక వందే భారత్ ఎక్స్ ప్రెస్,  జోధ్ పూర్- అహమ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదలయ్యాయి.  ఈ రైళ్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. వీటివలన రెండు రాష్ట్రాల రాజధాని నగరాల మధ్య అనుసంధానత పెరగటంతోబాటు ప్రయాణ సమయం ఆదా అవుతుతుంది. ఈ వందే భారత్ రైళ్లు ‘నవ భారతదేశం -వికసిత  భారత్’ నినాదాన్ని దేశం నలుమూలలకూ మోసుకువెళతాయి.

గోరఖ్ పూర్-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు గోరఖ్ పూర్ లో బయలుదేరి అదే రోజు లక్నో చేరుకుంటుంది. దారిలో బస్తి, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది.  వందే భారత్ రైలు నడపటం వలన గోరఖ్ పూర్, లక్నో మధ్య అనుసంధానత పెరగటంతోబాటు పరిసర ప్రాంతాల ఆధ్యాత్మిక ప్రదేశాలకు యాత్రికులు పెరుగుతారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. మాట సంబంధ పట్టణాల మధ్య అనుసంధానత కోసం ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ కూడా దీనిద్వారా  నెరవేర్చినట్టవుతుంది.

జోధ్ పూర్-అహమ్మదాబాద్ (సబర్మతి)

రాజస్థాన్ లోని జోధ్ పూర్ నుమకి అహమ్మదాబాద్ ( సబర్మతి) వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు జోధ్ పూర్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి అదే రోజు అహమ్మదాబాద్ ( సబర్మతి) స్టేషన్ చేరుకుంటుంది.  మార్గమధ్యంలో ఈ రైలు పాలీ మార్వాడ్, రానక్  పూర్ అబూ రోడ్  స్టేషన్లలో ఆగుతుంది.  ఈ రైలు వలన ఈ ప్రాంతంలోని సాంస్కృతిక, పర్యాటక , యాత్రా ప్రదేశాలకు వేగంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.వందే భారత్ ఎక్స్ ప్రెస్ వలన ఆహ్లాదకరమైన, రైలు ప్రయాణ అనుభూతి కూడా పెరుగుతుంది.

ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గోరఖ్ పూర్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.  రూ. 498 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ ను పునరభివృద్ధి చేస్తారు.  ఈ పనులు పూర్తయితే ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు అనేక నాణ్యమైన సౌకర్యాలు అందిస్తాయి. అత్యాధునిక భద్రతకోసం ఉద్దేశించిన కవచ్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ రైళ్ళు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతినిస్తాయి. రైలులోని ప్రతి బోగీకి సస్పెన్షన్ ట్రాక్షన్ ఉండటం వలన గంటకు 160  కిలోమీటర్ల వేగంలోనూ కుదుపులు ఉండవు. ఈ అత్యాధునిక సస్పెన్షన్ వ్యవస్థ వలన ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది. 30% విద్యుత్ ఆదాయ అయ్యేలా హరిత నమూనాలో  ఈ రైళ్ల డిజైనింగ్ జరిగింది.

 

***(Release ID: 1938110) Visitor Counter : 117