పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీతో డీజీసీఏ అవగాహన ఒప్పందం


-మానవరహిత విమాన వ్యవస్థలు & ఇన్నోవేటివ్ ఎయిర్ మొబిలిటీ కోసం ఎంఓయు

-భారతదేశం & యూరోపియన్ యూనియన్ మధ్య మానవరహిత విమానాలు & వినూత్న ఎయిర్ మొబిలిటీపై సహకారంపై దృష్టి పెడుతూ ఈ అవగాహన ఒప్పందం

- మెరుగైన ప్రమాణాలు & భారతీయ మానవరహిత విమానయాన రంగం యొక్క వేగవంతమైన వృద్ధికి దారితీయనున్న ఎంఓయు

Posted On: 05 JUL 2023 3:37PM by PIB Hyderabad

మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్, ఇన్నోవేటివ్ ఎయిర్ మొబిలిటీలో సహకారం కోసం పౌరవిమాన యాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏభారతదేశం యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ)తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయుపై సంతకం చేసింది ఒప్పందం మానవ రహిత విమానాల వ్యవస్థల  సహకారం మరియు ఇరు పౌర విమానయాన అధికారుల మధ్య వినూత్న వాయు రవాణా విషయమై దృష్టి పెడుతుంది సహకారంలో డీజీసీఏ మరియు ఈఏఎస్ఏ ల మధ్య ధృవీకరణ ప్రమాణాలు, పర్యావరణ ప్రమాణాలు, మానవరహిత విమాన వ్యవస్థల ధృవీకరణ, ఉపయోగం కోసం సంబంధిత అవసరాలు మరియు సిబ్బందికి లైసెన్సింగ్శిక్షణఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ (యుటీఎంప్రమాణాలు మరియు సేవలతో సహా కూడిన వినూత్న ఎయిర్ మొబిలిటీ కార్యకలాపాలలో సహకారం ఉంటుంది.  ఎంఓయు  ప్రాంతంలో సాంకేతిక పరిణామాలు మరియు పరిశోధనలపై ఇరు అధికారుల మధ్య క్రమమైన సమాచారాన్ని పంచుకునేలా చేస్తుంది. ఈ సమాచారం సంబంధిత వాటాదారులకు చేరుకోవడానికి వారి సంబంధిత వ్యూహాలను కూడా నిర్ధారిస్తుందిఇంకా ప్రాంతంలో డీజీసీఏ మరియు ఈఏఎస్ఏ ద్వారా కాన్ఫరెన్స్లువర్క్షాప్లుట్రైనింగ్ ప్రోగ్రామర్లను నిర్వహించడంలో ఎంఓయు సహకారంతో ఉంటుంది అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం వల్ల భారత మానవరహిత విమానయాన రంగం మెరుగైన  ప్రమాణాలు మరియు వేగవంతమైన వృద్ధికి దారితీస్తుందని భావిస్తున్నారు. 2023 ఏప్రిల్ 20న, న్యూఢిల్లీలో జరిగిన ఈయు-ఇండియా ఏవియేషన్ సమ్మిట్ సందర్భంగాయూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ)తో మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ మరియు ఇన్నోవేటివ్ ఎయిర్ మొబిలిటీపై డీజీసీఏ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)పై సంతకం చేసింది.

 

******



(Release ID: 1937674) Visitor Counter : 120