ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తొలి త్రైమాసికంలోఉత్పత్తి- అమ్మకాలలో గతంలో కన్నా అత్యుత్తమంగా రాణించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా

Posted On: 05 JUL 2023 9:10AM by PIB Hyderabad

ఆర్థిక సంవత్సరం 2023-24 (క్యు1) తొలి త్రైమాసికం లో ఉత్పత్తి, అమ్మకాల పరంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ ఎ ఐ ఎల్) రికార్డు స్థాయి పనితీరును ప్రదర్శించింది. 
హాట్ మెటల్, ముడి ఉక్కుతో పాటుగా వరుసగా 5.0637 (ఎంటి),4.667 ఎంటి ,4,405 ఎంటి విక్రయించ తగిన ఉక్కు ఉత్పత్తి చేసి తొలి త్రైమాసికంలో ఉత్తమ ఫలితాలు సాధించింది. ఈ గణాంకాలు గతంలోని ఉత్తమ ఫలితాలతో పోలిస్తే వరుసగా  ఏడు శాతం, 8 శాతం, 8% తో గణనీయమైన వృద్ధిని సూచిస్తున్నాయి 
తొలి త్రైమాసికం లో 3.9 ఎంటీ ల అమ్మకాల పరిమాణాన్ని సాధించడం ద్వారా తన అత్యధిక అమ్మకాల పనితీరును ప్రదర్శించింది. తద్వారా సి పి ఎల్ వై కంటే దాదాపు 24% శాతం వృద్ధిని సాధించింది. సామర్ధ్య తన సామర్థ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవడం, వినియోగదారుల డిమాండ్ డిమాండ్ ను తీర్చడం దృష్టిని పెట్టి సెయిల్ రికార్డు ను బద్దలు చేసే పనితీరును ప్రదర్శించింది.

 

***


(Release ID: 1937542) Visitor Counter : 157