సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అంతర్ రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్‌కు ఎంట్రీలను పంపేందుకు ఆఖరు తేదీ 8జులై 2023 వరకు పొడిగింపు
Posted On:
04 JUL 2023 2:42PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 వ్యాప్తిలో మీడియా సానుకూల పాత్రను, బాధ్యతను గుర్తిస్తూ, అంతర్ రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్ (ఎవైడిఎంఎస్) 2వ ఎడిషన్ -2023కు ఎంట్రీల సమర్పణకు ఆఖరు తేదీని 8 జులై 2023 వరకు పొడిగించాలని నిర్ణయించారు.
అంతర్ రాష్ట్రీయ యోగా దివస్ మీడియా సమ్మాన్ (ఎవైడిఎంఎస్) 2వ ఎడిషన్ 2023 నిమిత్తం మీడియా సంస్థలు తమ ఎంట్రీలను, విషయాంశాలతో కూడిన సమాచారాన్ని 8 జులై 2023 లోపల ఎవైడిఎంఎస్ 2023. ఎంఐబి @జిమెయిల్. కామ్‌కు పంపవచ్చు. దీనికి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శనాలను ఐ&బి మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ (https://mib.gov.in/)లఓనూ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (https://pib.gov.in)లో అందుబాటులో ఉంచారు.
***
(Release ID: 1937309)
Visitor Counter : 140