గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వయం సహాయక బృందాల సభ్యులుగా ఉన్న మహిళలు ఉత్పత్తి చేసిన మార్కెటింగ్ కోసం దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి ఎ వై -- ఎన్ ఆర్ ఎల్ ఎం) ఆధ్వర్యంలో ఒక మొబైల్ యాప్ ప్రారంభించారు

Posted On: 03 JUL 2023 5:08PM by PIB Hyderabad

    స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జి) మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ ను మరింత పటిష్టం చేయడానికి  డి ఎ వై -- ఎన్ ఆర్ ఎల్ ఎం ఆధ్వర్యంలో ఈసరస్ (eSARAS) మొబైల్ యాప్ ప్రారంభించారు.  దానివల్ల స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల అమ్మకానికి చేపట్టిన ఈకామర్స్ ఉపక్రమణకు తోడ్పడుతుంది.   యాప్ ను భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ న్యూఢిల్లీలో  ఆవిష్కరించారు.   దానితో పాటు  ఈ సందర్బంగా ఆయన మంత్రిత్వ శాఖకు చెందిన జనక్ పురి కార్యాలయంలో ఈసరస్ యాప్ నిర్వహణ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.  

       ఈసరస్ యాప్ నిర్వహణ కేంద్రాన్నిలాభాపేక్ష లేకుండా పనిచేసే ఎఫ్ డి ఆర్ వి సి అనే గ్రామీణ శృంఖల అభివృద్ధి సంస్థ సంబాళిస్తుంది/నడిపిస్తుంది.  ఎఫ్ డి ఆర్ వి సి  సంస్థను గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు టాటా ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.  ఈసరస్ పోర్టల్,  ఈ సరస్ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు కొనే వస్తువులను నిర్వహణ కేంద్రంలో ఉత్పత్తులను క్రమ పద్ధతిలో పొందుపరచి,  ప్యాకింగ్ చేసి రవాణా చేయడం జరుగుతుంది.  ఆన్ లైన్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి వినియోగదారు ఇంటి
గుమ్మం వరకు సరకులను నిల్వ, వసతి,  రవాణాకు సంబంధించిన వ్యూహరచన అంతా ఎఫ్ డి ఆర్ వి సి  చూస్తుంది.  

         ఈ సరస్ స్వయం సహాయక బృందాల మహిళల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఉద్దేశించిన ఈ-వాణిజ్య మొబైల్ యాప్.  ఇది సమర్ధవంతమైన మార్కెటింగ్ వేదిక.   కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మదిలో మెదిలిన ఈ భావనకు డి ఎ వై -- ఎన్ ఆర్ ఎల్ ఎం ఓ రూపం ఇచ్చాయి.    మహిళలు ఉత్పత్తి చేసిన విశ్వసనీయమైన హస్తకళలు మరియు చేనేతలను మార్కెటింగ్ చేయడం దాని  ఉద్దేశం.  

        యాప్ ఆవిష్కరించిన  శ్రీ శైలేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ స్వయం  సహాయక బృందాలకు చెందిన అక్కాచెల్లెళ్ళ చేతిలో తయారైన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం   ప్రారంభించిన యాప్ స్థానికతతో గొంతు కలపాలనే స్ఫూర్తిని ప్రోత్సహిస్తుందని అన్నారు.  ప్రతి స్వయం సహాయక బృందానికి చెందిన కుటుంబానికి కనీసం 2-3  జీవనోపాధి వనరులు ఉండాలన్నది మంత్రిత్వ శాఖ లక్ష్యమని అన్నారు.  వ్యవసాయేతర సంస్థ నుంచి పేదలకు  బహుళ వనరుల ఆదాయం లభించగలదని అన్నారు. వ్యవసాయేతర జీవనోపాధి కోసం స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు మార్కెట్ సంబంధాలు ఏర్పర్చడానికి మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వం / జోక్యం చేసుకోవాలని అన్నారు.   ఎస్ హెచ్ జి బృందాల సోదరీమణుల చేతి ఉత్పత్తులు ఇప్పుడు వినియోగహితమైన రీతిలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయని అన్నారు.  

        గ్రామీణ జీవనోపాధుల  (రూరల్ లైవ్లీహుడ్స్) అదనపు  కార్యదర్శి శ్రీ చరణ్ జిత్ సింగ్ స్వాగతం చెప్పారు.  ఈసరస్ యాప్,  పోర్టల్  ద్వారా నిర్వహిస్తున్న మార్కెటింగ్ కార్యక్రమం గురించి, ఇందుకు  అవలంభిస్తున్న వ్యూహాన్ని గురించి శ్రీ సింగ్ వివరించారు.  దానితో పాటు ఆఫ్ లైన్ లో ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం సరస్ మేళాలు , సరస్ ఆహార ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  

        గ్రామీణ జీవనోపాధుల డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ ,  ఎఫ్ డి ఆర్ వి సికి చెందినా శ్రీ బిపిన్ బిహారీ తదితరులు మాట్లాడారు.  
మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు,  ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.  



 

*****


(Release ID: 1937306) Visitor Counter : 206