వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

రేపు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రుల జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్న కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ


సదస్సుకు అధ్యక్షత వహించి చక్కెర-ఇథనాల్ పోర్టల్ ప్రారంభించనున్న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

Posted On: 04 JUL 2023 10:34AM by PIB Hyderabad

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రుల జాతీయ సమావేశాన్ని రేపు ( 2023 జూలై)న్యూ ఢిల్లీలో కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ నిర్వహించనుంది. ఖరీఫ్ పంట కాలం (కేఎంఎస్) 2023-24 లో  ముతక ధాన్యాల సేకరణ కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం, పీఎంజీకేఏవై ని సమర్థంగా అమలు చేయడానికి అమలు చేయడానికి కేంద్రం అమలు చేస్తున్న  చర్యలు లాంటి అంశాలు సదస్సులో చర్చకు రానున్నాయి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, ఆహారం, పోషక భద్రత కల్పించడానికి అమలు చేయాల్సిన చర్యలు కూడా సదస్సులో చర్చకు వస్తాయి.  

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ  మంత్రులు శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి, శ్రీ అశ్విని కుమార్ చౌబే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖ మంత్రులు సమావేశంలో పాల్గొంటారు. 

సదస్సులో చక్కెర-ఇథనాల్ పోర్టల్ ను శ్రీ పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు. స్మార్ట్-పిడిఎస్ అమలు జరుగుతున్న తీరు, సరఫరా వ్యవస్థ,  సేకరణ కేంద్రాల గ్రేడింగ్, చౌక  ధరల దుకాణాల వ్యవస్థలో అమలు చేయనున్న మార్పులు లాంటి అంశాలపై సదస్సులో చర్చలు జరుపుతారు. 

దేశంలో ఆహార, పోషకాహార భద్రతా వ్యవస్థలో మార్పులు తీసుకు రావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఎదురవుతున్న సమస్యలు, సమస్యలు  పరిష్కరించడానికి అమలు చేయాల్సిన చర్యలను సదస్సులో చర్చించి 2023-24 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన అంశంపై జాతీయ సదస్సు దృష్టి సారిస్తుంది.  

దేశంలో పేదలు, బలహీన వర్గాలకు సకాలంలో తగిన మొత్తంలో ఆహార ధాన్యాలు సరఫరా చేయడం లక్ష్యంగా గత 9 సంవత్సరాల కాలంలో కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అనేక కార్యక్రమాలు అమలు చేసింది. 2023 జనవరి 1 నుంచి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న  ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( పీఎంజీకేఏవై) ద్వారా అర్హత కలిగిన దాదాపు దాదాపు 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలను మంత్రిత్వ శాఖ సరఫరా చేసింది. 

మంత్రిత్వ శాఖ అమలు చేసిన చర్యల వల్ల టిపిడిఎస్ వ్యవస్థ పటిష్టంగా అమలు జరుగుతోంది. వ్యవస్థను మరింత బలోపేతం చేసి మరింత పటిష్టంగా అమలు చేయడానికి నూతన విధానాలు అమలు చేయాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఆహార, పోషకాహార భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు అమలు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

సదస్సులో పాల్గొనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రులు, కార్యదర్శులు ఆహార, పౌరసరఫరాల రంగం  అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలు, ఈ అంశంపై సహకారం తదితర అంశాలపై సలహాలు, సూచనలు అందిస్తారు. 

ముతక ధాన్యం/ చిరు ధాన్యాల  సేకరణ, సేకరణ కేంద్రాల గ్రేడింగ్, పీఎంజీకేఏవై ను సమర్థవంతంగా అమలు చేయడం, స్మార్ట్-పిడిఎస్ అమలు జరుగుతున్న తీరు వంటి ప్రధాన అంశాలను సదస్సులో చర్చిస్తారు. సదస్సులో భాగంగా చక్కెర -ఇథనాల్ పోర్టల్ ప్రారంభోత్సవం,  9-సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతి పై రూపొందించిన కరపత్రం ఆవిష్కరణ  కార్యక్రమం నిర్వహిస్తారు. 

సదస్సులో పాల్గొనే మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ అధికారుల నుంచి అండ్ సూచనలు, సలహాలు, చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాల ఆధారంగా ఆహారం, ప్రజా పంపిణీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు రూపొందుతాయి. 

  

 

***



(Release ID: 1937232) Visitor Counter : 163