ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఈ నెల 4న అసోంలో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి


ఐఐటీ గౌహతి 25వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉప రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 02 JUL 2023 2:34PM by PIB Hyderabad

భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్, ఈ నెల 04న అసోంలో పర్యటించనున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి 25వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు.

ఉప రాష్ట్రపతి గౌహతి చేరుకున్నాక కామాఖ్య ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఒక రోజు పర్యటనలో భాగంగా, ఐఐటీ గౌహతిలో విద్యార్థులతోనూ ఉప రాష్ట్రపతి సంభాషిస్తారు.

 

*****


(రిలీజ్ ఐడి: 1936973) సందర్శకుల సూచీ సంఖ్య : : 212
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Kannada