విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సుబన్‌సిరి దిగువ జలవిద్యత్ ప్రాజెక్టు ఎగువ స్థాయి వరకు ఆనకట్ట నిర్మాణం పూర్తి
Posted On:
30 JUN 2023 7:04PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో గల, ఎన్‌హెచ్‌పిసి నిర్మిస్తున్న 2,000 మెగావాట్ల సుబన్‌సిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగంగా, ఎలివేషన్ లెవెల్ (ఇఎల్- ఎత్తు స్థాయి) 210 మీ ఎత్తున అగ్ర భాగం వరకు అన్ని బ్లాకులలో ఆనకట్టను 29 జూన్ 2023నాటికి పూర్తి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించడం జరిగింది.
(ఇక్కడ ఎలివేషన్ లెవెల్ అంటే సగటు సముద్ర మట్టానికి సంబంధించిన ఎత్తు). కేంద్ర విద్యుత్, నూతన & పునరావృత ఇంధన మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్ 31 మే 2023న ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఆ సమయంలో, 14 బ్లాకులతో, 210 మీటర్ల ఎత్తును సాధించి ఆనకట్ట కాంక్రీటు పనిలో చెప్పుకోదగిన పురోగతిని ప్రాజెక్టు సాధించిందని, జూన్ 2023 నాటికి పూర్తి చేయవలసిన మిగిలిన రెండు బ్లాకుల నిర్మాణం పూర్తి అవుతుందని తెలియచేశారు.
ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం పనిలో 90%నికి పైగా పని పూర్తి అయినట్టు ఎన్‌హెచ్‌పిసి తెలిపింది. ఆనకట్ట, విద్యుత్ కేంద్రం, హైడ్రో మెకానికల్ (జలవిద్యుత్ యంత్ర) పనులు పూర్తి అయ్యే దిశగా వేగంగా పురోగమిస్తున్నాయి.
వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రేడియల్ గేట్ల పనిలో మిగిలినది పూర్తి కానుండగా, ఆర్థిక సంవత్సరం 2023-24 చివరినాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
పూర్తి అయిన తర్వాత సుబన్‌సిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధారపడిదగిన సంవత్సరంలో 90%న్ని, వార్షికంగా దాదాపు 7,500 మిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.
సుబన్‌సిరి జలవిద్యుత్ ప్రాజెక్టును 12 అక్టోబర్ 2004లో అటవీ అనుమతులను పొందిన తర్వాత జనవరి 2005లో ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే, స్థానిక వాటాదారుల ఉద్యమాలు, నిరసనల కారణంగా, ప్రాజెక్టు నిర్మాణం పని డిసెంబర్ 2011 నుంచి అక్టోబర్ 2019వరకు నిలిచిపోయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల తర్వాత 15 అక్టోబర్ 2019 నుంచి ప్రాజెక్టు నిర్మాణం తిరిగి ప్రారంభం అయింది.
***
(Release ID: 1936714)
Visitor Counter : 186