ఆర్థిక మంత్రిత్వ శాఖ
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్ సి), 2023 అమలు, నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వరంగ బ్యాంకులకు మరియు అర్హమైన ప్రైవేటు బ్యాంకులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Posted On:
30 JUN 2023 4:14PM by PIB Hyderabad
ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని ఆర్ధిక వ్యవహారాల శాఖ ఇందుకు సంబందించిన ఈ-గెజిట్ ను 2023 జూన్ 27వ తేదీన జారీచేసింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, 2023 అమలు, నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వరంగ బ్యాంకులకు మరియు అర్హులైన ప్రైవేటు బ్యాంకులకు అప్పగిస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బాలికలు / మహిళలకు ఈ స్కీములో ప్రవేశ సౌలభ్యం కల్పించడం దాని లక్ష్యం. ఈ ఉత్తర్వుతో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో చేరదలచినవారికి పోస్టాఫీసులలో, అర్హమైన షెడ్యూలు బ్యాంకులలో సర్టిఫికెట్ విలువ చెల్లింపు ద్వారా లభిస్తుంది.
ఈ స్కీము 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తపాలా శాఖ ద్వారా నిర్వహణలో ఉంది.
వివిధ రకాల ప్రణాళికాబద్ధమైన ఉపక్రమణల ద్వారా మహిళల రాజకీయ, సామాజిక మరియు ఆర్హిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల కొనసాగింపుగా 2023-24 ఆర్ధిక సంవత్సర కేంద్ర వార్షిక బడ్జెట్ లో దేశంలో ప్రతి బాలిక, మహిళ ఆర్ధిక భద్రత కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్ సి), 2023 స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
స్కీము ముఖ్యాంశాలు :
* అందరు బాలికలు, మహిళలకు ఆకర్షణీయమైన , సురక్షితమైన పెట్టుబడి ఎంపిక అవకాశం
* ఈ స్కీము కింద 2025 మార్చి 31 లోపల రెండేళ్ల కాలానికి ఖాతాను తెరవవచ్చు.
* ఎంఎస్ఎస్ సి లో చేసే డిపాజిట్లపై 7.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రతి మూడు నెలలకు చక్రవడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం మీద
సర్టిఫికెట్ పైన లభించే వార్షిక వడ్డీ కొంచెం ఇంచుమించుగా 7.7% ఉంటుంది.
* ఈ ఖాతాలో గరిష్టంగా రూ.2,00,000 ఉంచవచ్చు. కనీస డిపాజిట్ రూ. 1000, రూ.100 గుణకాలలో డిపాజిట్ చేయవచ్చు.
* ఈ స్కీము కింద జరిపే పెట్టుబడి కాలవ్యవధి (మెచ్యూరిటీ) ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్లు ఉంటుంది.
* పెట్టుబడిలోనే కాక స్కీము కాలంలో పాక్షిక విత్ డ్రాయల్ సౌకర్యం కూడా ఉంది. స్కీము ఖాతా నుంచి విత్ డ్రా చేయడానికి అర్హమైన నిల్వలో గరిష్టంగా 40% శాతం సొమ్మును విత్ డ్రా చేయడానికి ఖాతాదారు అర్హులు.
****
(Release ID: 1936557)
Visitor Counter : 212