వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాణిజ్య ఎగుమతుల లక్ష్యం ఒక ట్రిలియన్ డాలర్లకు చేరేందుకు వీలుగా ఎంఎస్ఎంఇ లకు అధికమొత్తంలో పరపతి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని శ్రీ పియూష్ గోయల్ బ్యాంకర్లను కోరారు.
ఎంఎస్ఎంఇ ఎగుమతిదారులకు ఎగుమతి పరపతి కల్పించడంపై జరిగిన బ్యాంకర్ల సమావేశానికి శ్రీ గోయల్ అధ్యక్షత వహించారు.
Posted On:
29 JUN 2023 5:53PM by PIB Hyderabad
వాణిజ్య ఎగుమతుల లక్ష్యం ఒక ట్రిలియన్ డాలర్లకు చేరేందుకు వీలుగా ఎంఎస్ఎంఇ లకు అధికమొత్తంలో రుణాలను
అందుబాటులోకి వచ్చేలా చూడాలని శ్రీ గోయల్ భారతీయ బ్యాంకులను కోరారు. ఎంఎస్ఎంఇ లకు ఎగుమతుల కోసం రుణాలు
పెంచడం విష్యం చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ గోయల్ ఈ మాటలన్నారు. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఈ సి జి సి) సహకారంతో కేంద్ర వాణిజ్య శాఖ న్యూఢిల్లీలో బుధవారం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బి ఐ) , బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా సహా 21 బ్యాంకుల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
'బ్యాంకులకు ఎగుమతి పరపతి మరియు ఎగుమతి పరపతి బీమా' అనే అంశంపై ఈ సి జి సి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం. సెంథిల్ నాథన్ వివరణాత్మక ప్రదర్శన సమర్పించారు. ఈ పథకం అమలులో తమకు ఉన్న గత అనుభవాల దృష్ట్యా ఎంఎస్ఎంఇ ఎగుమతిదారులలో ఎక్కువమందికి అధికమొత్తంలో రుణాలను అందుబాటులోకి తేవడానికి మరిన్ని సవరణలు చేయాలని ఈ సి జి సి ప్రతిపాదించింది. ప్రతిపాదిత సవరణల ప్రకారం రుణగ్రహీత ఖాతాలను 'ఏ ఏ' ఖాతాలుగా పరిగణించి ఎగుమతి దారులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు.
ఈ స్కీము కింద ప్రస్తుతం తొమ్మిది బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఇ లకు ఎగుమతి రుణాలు ఇస్తున్నారు. దానిని అన్ని బ్యాంకులకు విస్తరించే విషయాన్ని ఈ సి జి సి పరిశీలించాలని తద్వారా ఎంఎస్ఎంఇ ఎగుమతిదారులకు రుణాల మొత్తం పెంచవచ్చని శ్రీ పియూష్ గోయల్ అన్నారు.
దావాలను పరిష్కరించడానికి ఈ సి జి సి కూడా సూక్ష్మ, చిన్న సంస్థల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ అనుసరిస్తున్న విధానాన్ని
అనుసరించాలని బ్యాంకర్లు సూచించారు. నష్టపరిహారం చెల్లింపు కోసం ఈ సి జి సి కూడా అదే పద్ధతిని పాటించాలని మంత్రి సలహా ఇచ్చారు.
ప్రతిపాదిత స్కీము ద్వారా ప్రయోజనం పొంది ఎంఎస్ఎంఇ ఎగుమతిదారులకు తగిన మొత్తంలో ఎగుమతి రుణాలను అందుబాటులోకి తేవాలని మంత్రి బ్యాంకులకు సూచించారు. తద్వారా 2030 నాటికి దేశం ఒక ట్రిలియన్ డాలర్ల
వాణిజ్య ఎగుమతుల లక్ష్యం చేరగలదు. అదేవిధంగా ఈ సి ఐ బి స్కీము కింద బ్యాంకుల క్లెయిమ్ చెల్లింపులను క్లెయిమ్ అందిన 45 రోజుల లోపల 75% చెల్లింపు జరిపే విషయాన్ని పరిశీలించాలని ఈ సి జి సి అధికారులకు మంత్రి సలహా ఇచ్చారు. వచ్చే నాలుగు నెలల్లో ఈ సి జి సి సేవలను డిజిటలైజ్ చేస్తామని కూడా మంత్రి తెలిపారు.
***
(Release ID: 1936409)
Visitor Counter : 150