యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కిర్గిస్తాన్, హంగరీలో మల్లయోధులు వినేష ఫోగట్, బజరంగ్ పునియా శిక్షణ పొందేందుకు ప్రతిపాదనను ఆమోదించిన టాప్స్ (టిఒపిఎస్)
Posted On:
29 JUN 2023 6:48PM by PIB Hyderabad
భారతీయ మల్లయోధులు, లక్ష్యిత ఒలింపిక్ పోడియం (ఉన్నత వేదిక - టిఒపిఎస్) క్రీడాకారులు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు అంతర్జాతీయ శిక్షణా శిబిరం కోసం కిర్గిస్తాన్, హంగరీకి బయలుదేరి వెళ్ళనున్నారు.
వీరిద్దరూ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (ఎంవైఎఎస్) టిఒపిఎస్ బృందంకు వీరిరువురూ ప్రతిపాదనలు పంపగా, వారి ప్రతిపాదనను 24 గంటలలోగా ఆమోదించారు.
ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా 36 రోజుల శిక్షణా శిబిరం నిమిత్తం కిర్గిసా్తన్‌లోని ఇస్సిక్-కుల్‌కు వెళ్ళనుండగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ వతకధారి వినేష్ ఫోగట్ మొదట కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో ఒక వారం శిక్షణకు, అనంతరం హంగరీలోని టాటాకు 18 రోజు శిక్షణా శిబిరానికి బయలుదేరి వెళ్ళనున్నారు.
వినేష్ తో పాటు ఫిజియోథెరపిస్ట్ అశ్వినీ జీవన్ పాటిల్, మల్లయుద్ధ భాగస్వామి సంగీత ఫోగట్, కోచ్ సుదేశ్ వెడుతుండగా, బజ్రంగ్‌తో పాటుగా కోచ్ సుజీత్ మాన్, ఫిజియోథెరపిస్ట్ అనుజ్ గుప్తా, మల్లయుద్ధ భాగస్వామి జితేందర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణుడు కాజీ హసన్ వెడుతున్నారు.
ప్రభుత్వం వినేష్, బజరంగ్, వారి మల్లయుద్ధ భాగస్వాములు సంగీతా ఫోగట్, జితేందర్. కోచ్ సుదేష్, సుజీత్ మాన్ విమాన టిక్కెట్లు, బస, భోజనం ఖర్చు, శిబిరం ఖర్చు, విమానాశ్రయ బదిలీ ఖర్చులు, ఒపిఎ, ఇతర ఖర్చులు సహా ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.
అదనంగా, మల్లయోధులతో వెడుతున్న సహాయక సిబ్బంది ఖర్చును ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఒజిక్యూ) భరిస్తుంది.
జులై మొదటివారంలో వినేష్, బజరంగ్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
***
(Release ID: 1936313)
Visitor Counter : 134