సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'బహత్తర్ హురైన్' ట్రైలర్ వివాదంపై సి.బి.ఎఫ్.సి ప్రకటన

Posted On: 29 JUN 2023 5:23PM by PIB Hyderabad

బహత్తర్ హురైన్ సినిమా ట్రైలర్ వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి) ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. "బహత్తర్ హురైన్ (72 హూరైన్)" అనే టైటిల్తో ఉన్న ఒక చిత్రం, దాని ట్రైలర్కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి) సంస్థ సర్టిఫికేషన్ను నిరాకరించినట్లు మీడియాలోని కొన్ని విభాగాలలో తప్పుదారి పట్టించే నివేదికలు ప్రచారం చేయబడుతున్నాయిఅని అంటూ ఆయా మీడియా నివేదికలను పేర్కొందిఈ రిపోర్టులను ఖండిస్తూ  "బహత్తర్ హురైన్ (72 హూరైన్)" చిత్రానికి 'A' సర్టిఫికేట్ మంజూరు చేయబడిందని పేర్కొంది. ఈ సర్టిఫికేట్ 4-10-2019  జారీ చేయబడిందని పేర్కొందిఈ  చిత్రం యొక్క ట్రైలర్ 19-6-2023 సి.బి.ఎఫ్.సి.కి వర్తింపజేయబడింది. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952లోని సెక్షన్ 5B(2) ప్రకారం జారీ చేయబడిన మార్గదర్శకాల ప్రకారం పరిశీలించాల్సి ఉందని  పేర్కొంది. "దరఖాస్తుదారుని సమాచారం కింద అవసరమైన డాక్యుమెంటరీ సమర్పణల కోసం అడిగాము.. వాటిని స్వీకరించిన తర్వాత, సవరణలకు లోబడి ధృవీకరణ మంజూరు చేయబడింది. సవరణలను తెలియజేసే షోకాజ్ నోటీసు 27-6-2023న దరఖాస్తుదారు/చిత్రనిర్మాతకి జారీ చేయబడింది మరియు దరఖాస్తుదారు ప్రతిస్పందన/అనుకూలత పెండింగ్‌లో ఉంది." ఈ విషయం సరైన ప్రక్రియలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పుదోవ పట్టించే నివేదికలను ఇకపై వెల్లడించరాదని బోర్డు కోరింది.

******



(Release ID: 1936310) Visitor Counter : 137