చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
డిజిటల్ విభజనను తగ్గించి & అందరికీ న్యాయాన్ని అందించడం కోసం - ఇసేవా కేంద్రాలు
Posted On:
27 JUN 2023 12:54PM by PIB Hyderabad
న్యాయస్థానాలకు సంబంధించిన పౌర కేంద్రిత సేవలను, కేసు సంబంధిత సమాచారాన్ని అందరు వాటాదారులు సౌకర్యవంతంగా లబ్ధి పొందేలా 25 హైకోర్టుల కింద 815 ఇసేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇసేవా కేంద్రాల గురించిః న్యాయవాదులు, కక్షిదారులకు ఇ ఫైలింగ్ సేవలను అందించడం ద్వారా డిజిటల్ విభజనకు వంతెనగా ఇసేవా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అన్ని హైకోర్టులు, పైలెట్ ప్రాజెక్టుగా ఒక జిల్లా కోర్టు సహా అన్ని కోర్టు సముదాయాలలోనూ వీటి ఉనికి కోసం విస్తరణ జరుగుతోంది. న్యాయవాది లేదా కక్షిదారు అవసరమైన సౌలభ్యతకు సంబంధించిన సమాచారం, ఇఫైలింగ్‌ను అందించే ఉద్దేశ్యంతో కోర్టు సముదాయాల ప్రవేశద్వారాల వద్ద ఇసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
భారత దేశపు తొలి ఇ- రిసోర్స్ కేంద్రాన్ని 30 అక్టోబర్ 2020న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రారంభించారు. న్యాయకౌశల్ పేరిట వెలిసిన ఇ- రిసోర్స్ కేంద్రం భారత సుప్రీం కోర్టులోనూ, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లోనూ, జిల్లా కోర్టుల్లోనూ కేసులను ఇ-ఫైలింగ్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఇది ఆన్‌లైన్ ఇ-కోర్టు సేవలను అందుకోవడంలో న్యాయవాదులకు, కక్షిదారులకు తోడ్పాటు అందిస్తూ, సాంకేతికతను భరించలేనివారికి సహాయకునిగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా కేసులను ఇ-ఫైలింగ్ చేసే సౌకర్యాన్ని కల్పించడం, దృశ్యమాధ్యమం ద్వారా విచారణ జరపడం, స్కానింగ్, ఇ-కోర్టు సేవలను అందుబాటులోకి తేవడం సహా కాలాన్ని ఆదా చేయడం, శ్రమను నివారించడం, దూరప్రాంతాలకు ప్రయాణించడం, ఖర్చులను ఆదా చేయడం వంటి లాభాలను అందిస్తుంది.
***
(Release ID: 1935634)
Visitor Counter : 141