జౌళి మంత్రిత్వ శాఖ
పర్యారణానికి దోహదపడే తక్కువ బొగ్గు వినియోగం మరియు వృత్తఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే సుస్థిర వస్త్రాలకు భారతదేశం అగ్రగామి: కేంద్ర జౌళి మంత్రి శ్రీ పీయూష్ గోయల్
భారతీయ వస్త్ర పరిశ్రమ తన వినూత్న మరియు ఆకర్షణీయమైన ఉత్పత్తులతో ప్రపంచ వాణిజ్య రంగం పై తన ముద్ర వేసింది: శ్రీ గోయల్
క్లస్టర్-ఆధారిత విధానంతో రవాణా ఖర్చులను తగ్గించడానికి పీ ఎం మిత్రా పార్కులు మరియు తగిన పరీక్షా సౌకర్యాలతో నాణ్యమైన ఉత్పత్తులు: శ్రీ గోయల్
పరిశ్రమ నాణ్యతపై దృష్టి పెట్టాలని మరియు మెరుగైన నాణ్యమైన ఉత్పత్తుల కోసం కొత్త సాంకేతికతలను ఆవిష్కరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి యువతను ప్రోత్సహిస్తుంది,
శ్రీ గోయల్
ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్ టెక్స్‌టైల్ రంగంలో నాణ్యత మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి: శ్రీ గోయల్
Posted On:
26 JUN 2023 5:13PM by PIB Hyderabad
కేంద్ర టెక్స్‌టైల్స్, వాణిజ్యం మరియు పరిశ్రమలు మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, తక్కువ బొగ్గు వినియోగానికి మరియు వృత్త ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ పర్యావరణహిత సుస్థిరమైన వస్త్రాలకు భారతదేశం అగ్రగామిగా ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈరోజు జరిగిన 69వ భారత అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన (ఐఐజిఎఫ్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ భారత వస్త్ర పరిశ్రమ తన వినూత్నమైన మరియు ఆకర్షణీయమైన ఉత్పత్తులతో ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకుందని మంత్రి అన్నారు.
భారతదేశ వస్త్ర రంగాన్ని గణనీయమైన రీతిలో ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ మరియు అపెరల్ (PM MITRA) పార్క్‌ను దేశంలోని 7 రాష్ట్రాలలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సముచితమైన పరీక్షా సౌకర్యాలతో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ మరియు ఉత్పత్తి యొక్క క్లస్టర్ ఆధారిత విధానం కారణంగా పీ ఎం మిత్రా పార్కులు రవాణా ఖర్చులను తగ్గిస్తాయని శ్రీ గోయల్ చెప్పారు. ఈ పార్కులలోని యూనిట్లకు పీ ఎం మిత్రా పార్కుల స్థాన అనుకూలతల ప్రయోజనాలు దేశీయ డిమాండ్‌తో పాటు ఎగుమతులను బాగా తీర్చడానికి సహాయపడతాయని కూడా ఆయన అన్నారు.
మన దేశప్రజలు అత్యుత్తమ నాణ్యత గల వస్త్రాలకు అర్హులని, దీనిని వస్త్ర పరిశ్రమ భాగస్వాములందరూ నిర్ధారించాలని శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. పరిశ్రమ నాణ్యతపై దృష్టి పెట్టాలని మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను పరీక్షించాలని ఆయన ప్రోత్సహించారు. మెరుగైన నాణ్యమైన ఉత్పత్తుల ఉత్పత్తిని సులభతరం చేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ అభివృద్ధి చేయాలని మంత్రి యువతను చైతన్యపరిచారు. వస్త్ర రంగంలో నాణ్యత మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంపై ఐఐజిఎఫ్ తప్పనిసరిగా దృష్టి సారించాలని ఆయన అన్నారు.
వివిధ దేశాలతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు (సిఇపిఎ) మరియు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ)ల అవకాశాలను భారతదేశం చురుకుగా పరిశీలిస్తోందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందాలు మార్కెట్ పరిమాణాన్ని పెంపొందించడం మరియు అభివృద్ధి చెందుతున్న భారత టెక్స్‌టైల్ రంగంలో ఎగుమతిదారులకు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. ఈ ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, ఎగుమతులను పెంచడం మరియు వస్త్ర పరిశ్రమలో వృద్ధికి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి చెప్పారు.
ఇండియా ఇంటర్నేషనల్ గార్మెంట్ ఫెయిర్‌ను నిర్వహించడం కోసం మరియు భారతీయ వస్త్ర పరిశ్రమకు ప్రపంచ వాణిజ్యంలో మెరుగైన అవకాశం కల్పించడం కోసం అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (AEPC) యొక్క సహకారాన్ని శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించారు. కోట్లాది మందికి జీవనోపాధి అవకాశాలను అందించడంలో, కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో మరియు టెక్స్‌టైల్ రంగంలో సూక్ష్మ మరియు చిన్న యూనిట్లకు మద్దతు ఇవ్వడంలో టెక్స్‌టైల్ రంగానికి సేవ చేయడంలో ఏ ఈ పీ సీ పోషించిన ముఖ్యమైన పాత్రను మంత్రి గుర్తించారు. ట్రేడ్ ఫెయిర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు పరిశ్రమలు, పరిశ్రమ వ్యవస్థాపకులు మరియు ఇతర వాటాదారులకు వ్యాపార అవకాశాలను మెరుగుపరచడానికి జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గార్మెంట్ ఫెయిర్‌ను నిర్వహించాలని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. గౌతమ్ బుద్ధ నగర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ మహేశ్ శర్మ, ఏ ఈ పీ సీ చైర్మన్, శ్రీ నరేంద్ర గోయెంకా, సీనియర్ అధికారులు మరియు భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 1935540)
Visitor Counter : 142