రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జాతీయ భద్రత మా అత్యంత ప్రాధాన్యత: జమ్మూలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


"సాయుధ దళాలు తాజా ఆయుధాలను కలిగి ఉంటాయి; జాతీయ ప్రయోజనాలను పరిరక్షించగల పూర్తి సామర్థ్యం వాటికి ఉంది

"ఉగ్రవాదంపై సున్నా సహనం' అనే మా విధానం ఇతర దేశాల అవగాహనను మార్చేసింది"

“పీఓకేలో పాకిస్తాన్‌కు స్థానం లేదు; అది భారతదేశంలో ఒక భాగం"

“ సరిహద్దులను ఉల్లంఘించడాన్ని మా ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదు; చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మేము విశ్వసిస్తున్నాము”

ఎంక్యూ-9బి డ్రోన్స్ డీల్ ధరపై ఊహాజనిత నివేదికలను ఆర్‌ఎం తిరస్కరించారు

“సేకరణ ఖర్చును ఇతర దేశాలు అందించే ధరతో పోల్చాలి; ఏర్పాటు చేసిన సేకరణ విధానాన్ని అనుసరించాలి”

Posted On: 26 JUN 2023 3:32PM by PIB Hyderabad

జాతీయ భద్రత అనేది మా ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యత మరియు దేశ సార్వభౌమత్వం, ఐక్యత & సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంది. జూన్ 26, 2023న జమ్మూలో జరిగిన ‘నేషనల్ సెక్యూరిటీ కాన్క్లేవ్’లో ప్రసంగిస్తూ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం తన భద్రతా దృష్టాంతంలో ఒక నమూనా మార్పును చూసిందని ఆయన నొక్కి చెప్పారు. 2013-14లో భారతదేశ  ప్రతిష్ట బలహీనమైన దేశంగా ఉందని మన ప్రత్యర్థులు సమస్యలను సృష్టించడానికి అనుమతించారని, కానీ నేడు దేశం ప్రతి ముప్పును అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన ఎత్తి చూపారు.

జాతీయ భద్రతపై బ్లూప్రింట్ గురించి రక్షణమంత్రి వివరిస్తూ..ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నాలుగు నిర్దేశక సూత్రాలపై పని చేస్తోందని పేర్కొన్నారు- అవి: దేశ భద్రత & సార్వభౌమత్వానికి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడం; జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతి చర్య తీసుకోవడం; ప్రగతిని సులభతరం చేయడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడం & వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి మరియు ఉగ్రవాదం వంటి ప్రపంచ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కోవడానికి స్నేహపూర్వక దేశాలతో వాతావరణాన్ని నిర్మించడానికి దేశంలో సురక్షితమైన పరిస్థితులను సృష్టించడం అని తెలిపారు.

మిలటరీకి అత్యాధునిక ఆయుధాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడంలో ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సరిహద్దులు మరియు సముద్రాలను రక్షించడంలో సాయుధ దళాలకు పూర్తి సామర్థ్యం ఉందని దేశానికి హామీ ఇచ్చారు. "మా సాయుధ దళాలను ఆధునిక మిలిటరీల ముందు వరుసలో తీసుకురావడమే మా లక్ష్యం" అని ఆయన చెప్పారు.

‘‘సీమాంతర ఉగ్రవాదం ద్వారా దేశంలో శాంతి, సామరస్యాలను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే మేము అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదంపై సమర్థవంతమైన చర్యను ప్రారంభించాము. ‘ఉగ్రవాదంపై సున్నా సహనం’ అనే అర్థాన్ని ప్రపంచానికి చాటిచెప్పాం. ఉరీ మరియు పుల్వామా సంఘటనల తరువాత ఉగ్రవాదులను అంతమొందించడానికి సాహసోపేతమైన మరియు మొదటిరకం చర్యలు భారతదేశం యొక్క ‘ఉగ్రవాదంపై సున్నా సహనం’ విధానానికి మరియు సాయుధ దళాల అసమానమైన పరాక్రమానికి నిదర్శనం. నేడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా దేశాలు ఏకమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు మిస్టర్ జో బిడెన్‌తో ప్రధాని సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన ఉగ్రవాదం విషయంలో భారతదేశం ప్రపంచ ఆలోచనలను ఎలా మార్చేసిందో తెలియజేస్తోంది’’ అని రక్షణమంత్రి అన్నారు.

గత కొన్నేళ్లుగా కఠినమైన మరియు స్థిరమైన చర్యలు తీసుకుంటున్నందున జమ్మూ & కాశ్మీర్‌లో తీవ్రవాద నెట్‌వర్క్  గణనీయంగా బలహీనపడిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. “టెర్రర్ ఫండింగ్ అరికట్టబడింది. ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదక ద్రవ్యాల సరఫరా నిలిచిపోయింది. టెర్రరిస్టుల నిర్మూలనతో పాటు అండర్ గ్రౌండ్ వర్కర్ల నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

జమ్మూ & కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై రక్షణ మంత్రి మాట్లాడుతూ ఈ నిర్ణయం కేంద్ర పాలిత ప్రాంత ప్రజలను దేశ ప్రధాన స్రవంతితో అనుసంధానం చేసిందని మరియు శాంతి & పురోగతి యొక్క కొత్త శకాన్ని ప్రారంభించడంలో సహాయపడిందని తెలిపారు.

పీఓకేపై శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించినందున పాకిస్థాన్‌కు అక్కడ లోకస్ స్టాండి లేదు. భారత పార్లమెంటు కనీసం మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిందని అది పీఓకే భారతదేశంలో భాగమని పేర్కొందని వెల్లడించారు.

చైనాతో సరిహద్దు పరిస్థితిని అవగాహనా వ్యత్యాసానికి సంబంధించిన అంశంగా రక్షణమంత్రి  పేర్కొన్నారు. అయితే ఒప్పందాలు & ప్రోటోకాల్‌లు ఉన్నాయని దాని ఆధారంగా ఇరు దేశాల సైన్యాలు పెట్రోలింగ్ నిర్వహిస్తాయని చెప్పారు. 2020లో తూర్పు లడఖ్‌లో జరిగిన ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ చైనా సైన్యం తాను అంగీకరించిన ప్రోటోకాల్‌లను విస్మరించింది మరియు ఎల్‌ఏసీపై యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించింది. యథాతథ స్థితిని మార్చడానికి పిఎల్‌ఏ చేసిన ప్రయత్నాలను నిరోధించిన భారత సైన్యం యొక్క శౌర్యం మరియు అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.

సరిహద్దు సమస్యను చర్చల ద్వారా మరియు శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాలనే ప్రభుత్వ వైఖరిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సైనిక, దౌత్య స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. భారతదేశ సరిహద్దు, గౌరవం మరియు ఆత్మగౌరవం విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని ఆయన దేశానికి హామీ ఇచ్చారు. "మా సరిహద్దుల పవిత్రతను ఉల్లంఘించనివ్వము" అన్నారాయన.

సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు రక్షణలో ‘ఆత్మనిర్భర్త’ను సాధించడం వంటి జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను రక్షణ మంత్రి స్పృశించారు. స్వయం ప్రతిపత్తిని సాధించడానికి తీసుకున్న అనేక చర్యలను ఆయన వివరించారు. అవి సానుకూల స్వదేశీ జాబితాల నోటిఫికేషన్ మరియు 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమ కోసం రక్షణ మూలధన సేకరణ బడ్జెట్‌లో 75% కేటాయించడం వంటివి ఉన్నాయి. ''దిగుమతి చేసుకున్న ఆయుధాలపై ఆధారపడాలని భారత్ కోరుకోవడం లేదు. రక్షణ తయారీలో మనం స్వావలంబన సాధించినప్పుడే మన జాతీయ భద్రత బలపడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ అనేది మా లక్ష్యం. మా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నేడు, మనం ట్యాంకులు, విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు మరియు వివిధ రకాల ఆయుధాలను తయారు చేస్తున్నాము. 2014కి ముందు రూ.900 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు రూ.16,000 కోట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు త్వరలో రూ.20,000 కోట్ల మార్కును చేరుకుంటాయని ఆయన చెప్పారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం మరియు మిలిటరీ వ్యవహారాల శాఖ ఏర్పాటుతో సహా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ప్రభుత్వం ముందుకు సాగుతూనే ఉందని, థియేటర్ కమాండ్‌ల ఏర్పాటుకు కృషి జరుగుతోందని, ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ఆయన అన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో ప్రపంచ వేదికపై భారతదేశం రూపాంతరం చెందిన ఇమేజ్‌పై కూడా రక్షణ మంత్రి మాట్లాడారు. ప్రపంచ వేదికలపై ప్రధానికి ఉన్న విశ్వసనీయత కారణంగానే నేడు ప్రపంచం అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఆసక్తిగా వింటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రపంచీకరణ ప్రపంచంలో భారతదేశ భద్రతా ప్రయోజనాలను పరిరక్షించడానికి యూఎస్‌ & రష్యా వంటి ప్రధాన ప్రపంచ శక్తులతో సమన్వయం యొక్క ప్రాముఖ్యతను శ్రీ రాజ్‌నాథ్ సింగ్  నొక్కిచెప్పారు. భారత్‌, అమెరికాలను సహజ మిత్రదేశాలుగా చూస్తున్నామని వారి వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత సుస్థిరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్, స్పేస్ మరియు మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ రంగాలలో మిలిటరీ-టు మిలిటరీ సహకారం విస్తరణ, సమాచార భాగస్వామ్యం మరియు సహకారంతో భారత్-అమెరికా రక్షణ సహకారం వేగంగా వృద్ధి చెందిందని రక్షణ మంత్రి తెలిపారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శకానికి నాంది పలికిన ప్రధానమంత్రి ఇటీవల అమెరికా పర్యటనను ఒక మైలురాయిగా అభివర్ణించారు.

గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడానికి సమీకృత మరియు ఐక్య ప్రతిస్పందన కోసం శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. “భారతదేశం ఒక ప్రధాన ప్రాంతీయ శక్తి. అందువల్ల, మన భద్రతాపరమైన ఆందోళనలను  పొరుగున ఉన్న ఇతర దేశాలతో సమలేఖనం చేసుకోవడం చాలా ముఖ్యం ” అని ఆయన అన్నారు.

భారతదేశంలో ఎఫ్‌-414 ఫైటర్ జెట్ ఇంజిన్‌లను సహఉత్పత్తి చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఏరోస్పేస్-హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒప్పందం గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. “ఈ ఒప్పందంతో జెట్ ఇంజన్‌లను తయారు చేస్తున్న నాల్గవ దేశంగా అవతరిస్తాం. తేజస్ విమానాలకు ఈ మేడ్ ఇన్ ఇండియా ఇంజన్‌లను అమర్చనున్నారు." అని పేర్కోన్నారు.

యూఎస్‌ నుండి ఎంక్యూ-9బి డ్రోన్‌ల కొనుగోలు ధర మరియు ఇతర నిబంధనలపై ఊహాజనిత నివేదికలను తిరస్కరించిన రక్షా మంత్రి ఇతర దేశాలకు అందించే ఉత్తమ ధర జనరల్ అటామిక్స్ (జీఏ)తో రక్షణ మంత్రిత్వ శాఖ డ్రోన్‌ల కొనుగోలు వ్యయాన్ని పోల్చి చూస్తుందని పేర్కొంది. ప్రస్తుతమున్న ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అనుసరించి మాత్రమే కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.

***



(Release ID: 1935492) Visitor Counter : 164