రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావికాదళ దేశీయకరణః పరిశ్రమలకు అవకాశాలు అన్న ఇతివృత్తంపై ప్రభావశీల సదస్సును & బి2బి సెషన్ నిర్వహణ
Posted On:
26 JUN 2023 1:29PM by PIB Hyderabad
భారతీయ నావికాదళ దేశీయకరణః పరిశ్రమలకు అవకాశాలు అన్న ఇతివృత్తంపై ప్రభావశీల సదస్సును & బి2బి సెషన్ ను ఫిక్కీ పెడరేషన్ హైస్‌లోని హరిశంకర్ సింఘానియా కమిషన్ ఆడిటోరియం ఆఫ్ ఫిక్కీలో 26 జూన్ 23న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఎఫ్ఐసిసిఐ)తో భారతీయ నావికాదళం నిర్వహించింది.
సదస్సుకు ముఖ్య అతిథిగా మెటీరియల్ అధిపతి వీఎడిఎం సందీప్ నైతానీ హాజరై కీలకోపన్యాసం చేశారు.
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతీయ నావికాదళ స్వదేశీకరణ ప్రణాళికలు/ అంతిమ అవసరాలను సమిష్టిగా చర్చించేందుకు పరిశ్రమ/ ఎంఎస్ఎంఇ/ స్టార్టప్‌లు భారతీయ నావికాదళ సిబ్బందితో ముచ్చటించేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించడమే కాక వాటాదారులందరికీ ఒక వేదికను అందించింది.
భారతీయ నావికాదళం, పరిశ్రమ/ ఎంఎస్ఎంఇ/ స్టార్టప్‌ల మధ్య నిబద్ధతతో బి2బి ప్రభావశీల చర్చను, లక్ష్యిత రౌండ్ టేబుల్ చర్చల్లో భాగంగా నావికాదళానికి కీలకమైన స్వదేశీ అవసరాలను చర్చను నిర్వహించారు.
భారత ప్రభుత్వ దార్శనికత అయిన మేక్ ఇన్ ఇండియా కు అనుగుణంగా ఈ సదస్సు దేశీయకరణను ప్రోత్సహించింది.
మొత్తం 100కు పైగా పరిశ్రమలు/ ఎంఎస్ఎంఇలు/ స్టార్టప్‌లు ఈ సదస్సులో పాల్గొన్నాయి.
***
(Release ID: 1935409)
Visitor Counter : 167