ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్య సభ సభ్యుని గా ఉన్న శ్రీహర్ ద్వార్ దుబే కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 JUN 2023 3:00PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్య సభ సభ్యుడైన శ్రీ హర్ ద్వార్ దుబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
‘భాజపా కు చెందిన చాలా చురుకైనటువంటి పార్లమెంటు సభ్యుడు శ్రీ హర్ ద్వార్ దుబే మరణించారన్న వార్త తెలిసి అత్యంత దుఃఖం కలిగింది. ఆయన క్షేత్ర స్థాయి తో అనుబంధాన్ని కలిగివున్నటువంటి నేత. ఉత్తర్ ప్రదేశ్ వికాస యాత్ర లో ఆయన అందించినటువంటి కీలకమైన తోడ్పాటు కు గాను ఆయన ను సదా స్మరించుకోవడం జరుగుతుంది. ఈ శోక ఘడియ లో, ఆ ఈశ్వరుడు ఆయన కుటుంబ సభ్యుల కు మరియు ఆయన ప్రశంసకుల కు దుఃఖాన్ని ఓర్చుకొనేటటువంటి శక్తి ని ప్రసాదించు గాక. ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1935385)
आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada