సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మాల్దీవుల 24వ బ్యాచ్ సివిల్ సర్వెంట్లకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన ఎన్.సి.జి.జి


- ఇప్పటి వరకు మాల్దీవులకు చెందిన 685 మంది అధికారులు శిక్షణ

- అందరికీ సమానమైన విద్యను అందించాలని సివిల్ సర్వెంట్లను కోరిన డీజీ శ్రీ భరత్ లాల్

- ప్రాథమిక సౌకర్యాలతో మహిళలకు సాధికారత కల్పించడం ఆర్థికాభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడుతుంది: ఎన్.సి.జి.జి డీజీ

Posted On: 25 JUN 2023 1:35PM by PIB Hyderabad

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) భాగస్వామ్యంతో నిర్వహించబడిన మాల్దీవుల పౌర సేవకుల 2-వారాల సామర్థ్య పెంపు కార్యక్రమం (సీబీపీ) జూన్ 23, 2023న ముగిసింది. 2024 నాటికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నెన్స్ రంగంలో 1,000 మంది పౌర సేవకుల నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడానికి మాల్దీవుల ప్రభుత్వంతో ఎన్.సి.జి.జి.  అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా, ఎన్.సి.జి.జి.ఇప్పటికే మాల్దీవులకు చెందిన 685 మంది అధికారులకు శిక్షణ ఇచ్చింది. మాల్దీవుల పౌర సేవకుల కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా ముగియడం.. భాగస్వామ్య విలువలు మరియు సహకార స్ఫూర్తిని ఏకీకృతం చేయడాన్ని సూచిస్తుంది.. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క 'పొరుగువారికి మొదటి ప్రాధాన్యత' విధానానికి నిదర్శనంగా నిలుస్తుంది. వినూత్న విధానాలను స్వీకరించడం ద్వారా, కార్యక్రమం  నుండి సేకరించిన పాఠాలను చేర్చడం ద్వారా, అధికారులు వారు సేవ చేసే ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమాన్ని పెంపొందించడానికి సమర్థవంతంగా దోహదపడతారు. పౌరులందరికీ గృహావసరాలు, వంటగ్యాస్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు,  నైపుణ్యాభివృద్ధి వంటి ఇతర అవసరాలకు భరోసా కల్పించడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క తిరుగులేని నిబద్ధతను గుర్తిస్తూ.. అధికారులు ఈ కార్యక్రమాలను అనుకరించి జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంలో గణనీయమైన ప్రగతిని సాధించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఈ ప్రాథమిక సౌకర్యాలను సమర్ధవంతంగా అందించాలనే తమ సాధనలో వేగం మరియు స్కేల్‌తో పనిచేయడం మరియు ఎటువంటి అంశాన్ని వదలకుండా అన్ని అంశాలలో శిక్షణ యొక్క ప్రాముఖ్యతను డీజీ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.

Image

బాగా చదువుకున్న, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకః

బాగా చదువుకున్న మరియు నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ప్రపంచ రంగంలో ఆవిష్కరణ, ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.  విద్యా రంగంపై ప్రభావం చూపే విధానాల రూపకల్పనలో మరియు అమలు చేయడంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నందున, సివిల్ సర్వెంట్లకు ప్రత్యేకమైన బాధ్యత ఉందని శ్రీ భరత్ లాల్ ఉద్ఘాటించారు. విద్యకు సమానమైన ప్రాప్యతను అందించాలని, అభ్యాస అవకాశాలలో అంతరాలను పరిష్కరించాలని మరియు నైపుణ్యాభివృద్ధికి సమగ్ర విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన వారిని కోరారు. 24 గంటల నీరు మరియు విద్యుత్ సరఫరా మరియు తగినంత పారిశుధ్య సౌకర్యాలు వంటి అవసరమైన సౌకర్యాల ఏర్పాటు ద్వారా మహిళలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను  డీజీ ఈ సందర్బంగా నొక్కి చెప్పారు.  ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం ఆర్థిక ఫలితాలను పెంచడమే కాకుండా లింగ సమానత్వాన్ని పెంపొందిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలలో వారి సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం ద్వారా, సమాజాలు తమ మానవ మూలధనం యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయగలవు మరియు స్థిరమైన వృద్ధిని ముందుకు తీసుకుపోగలవని  ఆయన అన్నారు. డిజిటల్ విప్లవం యొక్క సంభావ్యతను ఉపయోగించుకోవడం మరియు డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్లే సాధనంగా సరికొత్త ఐటీ ఆవిష్కరణలను స్వీకరించడం కోసం పౌర సేవకులు అవసరంపై ఆయన గణనీయమైన దృష్టి పెట్టారు. డిజిటల్ సాధనాలు మరియు వేదికల స్వీకరణ వేగవంతమైన నిర్ణయం తీసుకోవడాన్ని, మెరుగైన డేటా నిర్వహణను మరియు ప్రభుత్వ సేవలకు ప్రాప్యతను పెంచడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా పాలన యొక్క మొత్తం సామర్థ్యం మరియు ప్రభావాన్ని పెంచుతుందన్నారు. మార్పు ఏజెంట్లుగా వారి పాత్రను మరియు స్థానిక పరిస్థితులపై వారి లోతైన అవగాహనను గుర్తిస్తూ, విధానాలను విజయవంతంగా అమలు చేయడంలో మరియు వారి సంబంధిత డొమైన్‌లలో అనుకూలమైన ఫలితాలను సాధించగల సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

Image

వివిధ పథకాలపై అవగాహన చర్యలు..

కార్యక్రమ అవలోకన విషయమై కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ బి. ఎస్. బిష్త్ మాట్లాడుతూ.. 24వ సామర్థ్య పెంపు కార్యక్రమంలో ఎన్.సి.జి.జి. దేశంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల విశేషాలను వారితో పంచుకుందని అన్నారు. మారుతున్న పాలనా నమూనా, కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు పర్యవేక్షణ వ్యవస్థ, భారతదేశం మాల్దీవుల సంబంధాలు, ఆధార్: సుపరిపాలన సాధనం, ప్రజా విధానాల అమలు, మహిళలను సమ్మిళిత పాలన, ప్రజా పరిపాలనలో ఆవిష్కరణ, డిజిటల్ గవర్నెన్స్ మరియు పబ్లిక్ సర్వీస్ డెలివరీ, స్మార్ట్ సిటీ అభివృద్ధి, అందరికీ గృహనిర్మాణం, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం, వివిధ అభివృద్ధి పథకాల నుండి ఉత్తమ పద్ధతులు, పట్టణ పాలన, తాగునీటి కోసం తక్కువ ధరలో డీశాలినేషన్, వాతావరణ మార్పు, పర్యాటకం, జల్ జీవన్ మిషన్, ఇ-గవర్నెన్స్ మరియు డిజిటల్ ఇండియా ఉమంగ్, నాయకత్వం, సమన్వయం మరియు కమ్యూనికేషన్, ముద్రా యోజన, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ పాలన, పారిశుధ్యం మరియు ప్రజారోగ్య ప్రవర్తన, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన భారతదేశం, అవినీతి వ్యతిరేక వ్యూహాలు, హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల భారతదేశం యొక్క విధానం తదితర అంశాలను గురించి శిక్షణనిచ్చారు. విభిన్న శ్రేణి అభివృద్ధి ప్రాజెక్టులు మరియు సంస్థలపై సమగ్ర అవగాహనను అందించడానికి జాగ్రత్తగా నిర్వహించబడిన సందర్శనలలో పాల్గొనే అవకాశం ఉంది.  మేటి సందర్శనలలో, పాల్గొనేవారు డెహ్రాడూన్‌లోని స్మార్ట్ సిటీ, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషన్, ప్రధానమంత్రి సంగ్రహాలయ వంటి వాటిని విక్షించే అవకాశాన్ని పొందారు. ఇది పాలన యొక్క ఆచరణాత్మక అంశాల గురించి వారి జ్ఞానాన్ని సుసంపన్నం చేసింది. 24వ సీబీపీని మాల్దీవుల కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ బీ. ఎస్. బిష్త్, కో-కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ శర్మ, ఎన్.సి.జి.జి. మొత్తం సీబీపీ బృందం పర్యవేక్షించారు. పాఠ్యప్రణాళిక అభివృద్ధి, సెషన్ సమన్వయం మరియు జ్ఞాన వ్యాప్తికి వారి సహకారం పాల్గొనేవారికి సమగ్రమైన మరియు ప్రభావవంతమైన అభ్యాస అనుభవాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించింది.

 

 

******



(Release ID: 1935266) Visitor Counter : 118