ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జూన్ 26-28, 2023 వరకు రిషికేశ్‌లో మూడో మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ సమావేశం

Posted On: 25 JUN 2023 5:53PM by PIB Hyderabad

 

భారత అధ్యక్షతన జరగనునన్న జీ20 సమావేశాలకు సంబంధించిన మూడో జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యుజీసమావేశం  జూన్ 26 నుండి 28, 2023 వరకు ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో జరగనుందిజీ20 సభ్య దేశాలుఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి మొత్తం 63 మంది ప్రతినిధులు భారత అధ్యక్షతన జరగనున్న జీ20 -2023లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండాపై చర్చలను కొనసాగించడానికి ఈ మూడో జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యుజీసమావేశంలో పాల్గొననున్నారు. మార్చి 2023లో విశాఖపట్టణంలో జరిగిన రెండవ ఐడబ్ల్యుజీ  సమావేశం అంశాలను చర్చలను అనుసరిస్తూ ఈ సమావేశంలో ఆయా దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.  జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్లోని వివిధ అంశాలపై చర్చిస్తుందిఇందులో మౌలిక సదుపాయాలను అసెట్ క్లాస్గా అభివృద్ధి చేయడంనాణ్యమైన మౌలిక సదుపాయాల పెట్టుబడిని ప్రోత్సహించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడి కోసం ఆర్థిక వనరులను సమీకరించడం, ఇందుకు గాను వినూత్న సాధనాలను గుర్తించడం వంటివి ఉన్నాయిఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ యొక్క ఫలితాలు జీ20 ఆర్థిక ట్రాక్ ప్రాధాన్యతలను తెలియజేస్తాయి. అవస్థాపన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయిమూడో ఐడబ్ల్యుజీ సమావేశంలో 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండాలోని వివిధ వర్క్స్ట్రీమ్ పట్ల గణనీయమైన పురోగతి గురించి చర్చించబడుతుంది సమావేశంలో చర్చించే  ఇతర ప్రాధాన్యత్యాంశాలతో పాటుగా  "రేపటి నగరాలకు ఆర్థిక తోడ్పాటుసమ్మిళితస్థితిస్థాపకంగా మరియు స్థిరంగా"

అనే ప్రధాన ప్రాధాన్యతపై కూడా చర్చలు జరగనున్నాయి.  మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రతినిధుల కోసం పలు అధికారిక సమావేశాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  అధికారిక చర్చలతో పాటు, ప్రతినిధులు రిషికేశ్ యొక్క గొప్ప సంస్కృతి మరియు అందమైన ప్రకృతి దృశ్యాలను గురించి తెలుసుకొంటారు. అధికారులు జూన్ 28 మధ్యాహ్నం ప్రతినిధుల కోసం విహారయాత్రను కూడా ఏర్పాటు చేశారు. ఐడబ్ల్యుజీ సమావేశాల నేపథ్యంలో రెండు వైపు ఈవెంట్లు కూడా ప్లాన్ చేయబడ్డాయిజూన్ 26ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ భాగస్వామ్యంతో “సుస్థిర నగరాలకు రోడ్మ్యాప్పై ఉన్నత స్థాయి సెమినార్” కూడా నిర్వహించబడుతుంది. ఈ

మూడు సెషన్లలో జరిగే చర్చలు సాంకేతికతఇన్ఫ్రాటెక్, డిజిటలైజేషన్ పాత్రను అన్వేషించడంతో పాటు వాతావరణ మార్పు నుండి మౌలిక సదుపాయాల స్థితిస్థాపకతవేగవంతమైన పట్టణీకరణ మరియు సమగ్రత వరకు కీలక సవాళ్లను వినడానికి జీ2నిర్ణయాధికారులను అనుమతిస్తుందిఇండోనేషియాలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్త నగర అభివృద్ధి నుసంతారాను ప్రారంభించడంలో ప్రతినిధులు ప్రత్యేక దృక్పథం నుండి నేర్చుకుంటారుచాలా మంది అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణులు చర్చలో పాల్గొంటున్నారుజూన్ 27, "భారతదేశాన్ని ఒక ఎంఆర్ఓ హబ్గా మార్చడంపై రౌండ్ టేబుల్ఎంఆర్ఓ స్పేస్లో భారతదేశం అందించే అవకాశాల గురించి చర్చించడానికి ఒక ఎజెండాతో షెడ్యూల్ చేయబడిందిఉత్తరాఖండ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించడానికి మరియు స్థానిక వంటకాలను ఆస్వాదించడానికి అవకాశాన్ని అందించడానికి ప్రతినిధులకు "రాత్రి భోజ్ పర్ సంవాద్" (విందుపై సంభాషణకోసం కూడా ఆతిథ్యం ఏర్పాటు చేయడమైంది.   ప్రెసిడెన్సీ  ప్రతినిధులు 2023 జూన్ 26 "యోగా రిట్రీట్"ని కూడా ప్లాన్ చేసింది.

****


(Release ID: 1935265) Visitor Counter : 174