రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఇండియా – అమెరికాల మధ్య రక్షణ రంగ కార్యకలాపాలలో వేగ వృద్ధికి సంబంధించిన ఇండస్ ఎక్స్ అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ప్రారంభం.


కీలక, వినూత్న సాంకేతికతలు (ఐసిఇటి) అనే కార్యక్రమం కింద ‘ రక్షణ రంగ ఆవిష్కరణల అనుసంధానత’కార్యరూపం దాల్చేలా చేసేందుకు

ఇండస్ ఎక్స్ వాస్తవస్థితిగతులకు సంబంధించిన పత్రం విడుదల.

Posted On: 22 JUN 2023 9:09AM by PIB Hyderabad

భారత – అమెరికాల మధ్య  రక్షణ రంగ పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణల విషయంలో పరస్పర సహకారాన్ని వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన  (ఇండస్ ఎక్స్) కార్యక్రమం 2023 జూన్ 21న అమెరికాలోని  వాషింగ్టన్ డిసిలో ప్రారంభమైంది.  ఇండస్ ఎక్స్  ఈవెంట్ ను  ఇన్నొవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐ డెక్స్), రక్షణ మంత్రిత్వశాఖ, అమెరికా  రక్షణ విభాగం(డిఒడి) సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీనికి భారత – అమెరికా బిజినెస్ కౌన్సిల్ ఆతిథ్యం ఇచ్చింది.

2023 జూన్ 20,21 తేదీలలో నిర్వహించిన ఇండక్స్ ఎక్స్ ఈవెంట్కు భారత రక్షణ మంత్రిత్వశాఖ కు చెందిన , రక్షణ పరిశ్రమల ప్రోత్సాహక విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ  అనురాగ్ బాజ్  పాయి నాయకత్వంలో భారత ప్రతినిధి వర్గం హాజరైంది. ఈ కార్యక్రమం సందర్భంగా భారత , అమెరికా ప్రతినిధివర్గాలు, రక్షణ రంగ స్టార్టప్లు, మేధావులు, ఇంక్యుబేటర్లు,  ఇన్వెస్టర్లు, పరిశ్రమకు చెందిన వారు, ఈ రంగంతో సంబంధం ఉన్న వారికి  ప్రత్యేక స్వాగతం పలికే  కార్యక్రమాన్ని 2023 జూన్ 20 నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కీలకోపన్యాసం చేశారు.

అమెరికా వైమానిక దళానికి చెందిన అండర్ సెక్రటరీ ఫ్రాంక్ కెండాల్ జూన్ 21న జరిగిన ఇండస్ ఎక్స్ ఈవెంట్ లో కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన,ఇండియా – అమెరికా సంబంధాలు అద్భుతమైన స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పారు.  డీప్ టెక్ ఆవిష్కరణల రంగంలో ఇరు దేశాలకు చెందిన స్టార్టప్ లకు  ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రత్యేకించి, అంతరిక్షరంగం, కృత్రి మ మేథ (ఎఐ) రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. శ్రీ అనురాగ్ బాజ్పాయ్ స్వాగతోపన్యాసం  చేస్తూ,  అమెరికా– భారత  భవిష్యత్ రక్షణ రంగ  సంబంధాలమెరుగుకు తీసుకునే చర్యలపై పెట్టుబడి పెట్టడం గురించి ప్రస్తావించారు. ఇండియా– అమెరికా సంబంధాలలో ఐసిఇటి ఆవిష్కరణ కీలక మలుపు అని ఆయన  తెలిపారు.  ప్రపంచంలోని రెండు  అతి పెద్ద , ప్రాచీన ప్రజాస్వామిక దేశాల నాయకులు వాషింగ్టన్లో సమావేశమౌతున్నందన, ఈ ఈవెంట్ నిర్వహణకు ఇది సరైన సమయమని ఆయన అన్నారు.


భారత, అమెరికా స్టార్టప్లు అధునాతన సాంకేతికతలను సమష్టి  ఉత్పత్తి, సమిష్టి అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాజ్పాయ్ అన్నారు. వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఇన్వెస్టర్ల మధ్య భవిష్యత్లో కొలాబరేషన్లను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిందిగా  ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం చేపట్టిన మేక్ ఇండియా కార్యక్రమం గురించి బాజ్ పాయ్ తమ ప్రసంగంలో వివరించారు. ఆత్మనిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియాల తాత్వికత ప్రపంచం కోసమే నని ఆయన తెలిపారు.  ఈ ఈవెంట్ సందర్భంగా తొలిసారి, ఇండియా, అమెరికాలకు చెందిన స్టార్టప్ కంపెనీలు వినూత్న సాంకేతికతలను ప్రదర్శించాయి.  ఇందులో 15 భారతీయ స్టార్టప్లు , 10 అమెరికా స్టార్టప్లు పాల్గొన్నాయి. ఇవి సమద్రయానం, కృత్రిమ మేథ, స్వతంత్ర వ్యవస్థలు, అంతరిక్షరంగం వంటి వాటికి సంబంధించిన వినూత్న సాంకేతికతలను ఇండియా, అమెరికా స్టేక్హోల్డర్లకు ప్రదర్శించాయి.

ఈ ఎగ్జిబిషన్ ను అమెరికా  సీనియర్ అధికారులు, అమెరికన్   కాంగ్రెస్ కు చెందిన ఆర్మ్డ్ సర్వీస్ కమిటీకి చెందిన  రొ ఖన్నా, ఇన్నొవేటివ్ టెక్నాలజీస్ ,ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఐటిఐ) సబ్ కమిటీ సభ్యడు, ఇండియా, ఇండయనన్ అమెరికన్ల కంగ్రెషనల్ కాకస్ కో ఛైర్మన్, అమెరికా డిఒడి కి చెందిన డిప్యూటి అండర్ సెక్రటరీ రాథా అయ్యంగార్ ప్లంబ్ తదితరులు తిలకించారు. ఈ కార్యక్రమం సందర్భంగా రెండు ప్యానల్ చర్చలు రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఇవి వివిధరంగాలు ప్రత్యేకించి ప్రభుత్వం, అకాడమియా, పరిశ్రమ రంగాలకు చెందిన స్టార్టప్ ల విషయంలో  మరింత లోతైన సహకారంపై దృష్టిపెట్టాయి. అలాగే ఎగుమతి నియంత్రణ నిబంధనలపై కూడా ఈ సమావేశాలలో చర్చ జరిగింది.ఈ సమావేశాలలోనే ఇండస్ ఎక్స్  వాస్తవ స్థితిగతుల   నివేదికను విడుదల చేశారు.

 

***(Release ID: 1934704) Visitor Counter : 129