రక్షణ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 సందర్భంగా యోగ విన్యాసాలు చేసి ప్రదర్శించిన దాదాపు 11 లక్షల మంది ఎన్‌సిసి కేడెట్లు
Posted On:
21 JUN 2023 3:17PM by PIB Hyderabad
భారత దేశ వ్యాప్తంగా భిన్న ప్రదేశాలలో 11 లక్షల మంది ఎన్‌సిసి కేడెట్లు పూర్తి ఉత్సాహం, శ్రద్ధలతో పాల్గొనగా నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) 21 జూన్ 2023న 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిజరుపుకుంది.
దేశం నలుమూలలా ఉత్తరాన లేహ్ నుంచి దక్షిణాన కన్యాకుమారి & పశ్చిమాన ద్వారక నుంచి తూర్పులో తేజు వరకు పార్కులు, బహిరంగ మైదానాలు, పాఠశాలలు, కళాశాలలలో యోగా సెషన్లను నిర్వహించారు.
ఢిల్లీ కాంట్‌లో 3దళాల నుంచి వచ్చిన ఉత్సాహవంతమైన కేడెట్లకు డిజిఎన్‌సిసి లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్, ఎవిఎస్ఎం విఎస్ఎం అధ్యక్షత వహించారు. హర్ ఆంగన్ యోగా (ప్రతి ప్రాంగణంలో యోగ) & యోగా ఫర్ వసుధైవ కుటుంబకం (వసుధైవ కుటుంబానికి యోగ) అన్న ఇతివృత్త సారాన్ని వివరిస్తూ, యోగజీవన విధానాన్ని అనుసరించవలసిందిగా ఆయన ఉద్బోధించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా, కేడెట్ల కోసం ఎన్‌సిసి సాధనా సెషన్లను నిర్వహించింది. వ్యక్తిగత ఆరోగ్యంపై యోగ విన్యాసాల సారాంశంతో పాటుగా సమాజం పట్ల విధేయత, ఐక్యత సందేశాన్ని బోధించడం ఈ సెషన్ల లక్ష్యం.
ఈ కార్యక్రమంతో మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్ సందేశాన్ని దేశంలోని యువ మనస్సులలో, బుద్ధిలో స్థిరపడేలా చేయడం ద్వారా దేశంలో యోగా ఫిట్‌నెస్, ఆరోగ్యం సందేశ వ్యాప్తి బాధ్యతను ఎన్‌సిసి మరొక్కసారి తీసుకుంది.
***
(Release ID: 1934113)
Visitor Counter : 93