వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-23 ఖరీఫ్ మార్కెట్లో సీజన్ (కేఎంఎస్)లో సజావుగా సాగుతున్న ధాన్యం సేకరణ ; జూన్ 19నాటికి 830 లక్షల మిలియన్ టన్నుల (ఎల్ఎంటి) ధాన్యం సేకరణ


కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలలో 1.22 కోట్ల మంది రైతులకు
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అవుట్‌ఫ్లో కింద రూ. 1,71,000 కోట్ల లబ్ది

గోధుమలు, వరి పంటలకు గత ఏడాది రూ. 2,05,896 కోట్లు చెల్లిస్తే
ఈ ఏడాది ఎంఎస్‌పి చెల్లింపు రూ. 2,26,829 కోట్లుగా నమోదు

Posted On: 21 JUN 2023 11:55AM by PIB Hyderabad
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2022-23లో కేంద్ర  ప్రభుత్వం వరి సేకరణ సజావుగా సాగింది. కనీస మద్దతు ధర ( ఎంఎస్‌పి) కార్యకలాపాల కింద 19.06.2023 వరకు సెంట్రల్ పూల్ కోసం 830 లక్షల మెట్రిక్ టన్ను (ఎల్ఎంటి) కంటే ఎక్కువ వరి కొనుగోలు చేశారు. కేఎంఎస్ 2022-23లో  కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాల నుండి ఇప్పటివరకు 1.22 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు,  ఎంఎస్‌పి అవుట్‌ఫ్లో రూ. 1,71,000 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ అయింది.
ఎలాంటి అవాంతరాలు లేని కొనుగోళ్ల కార్యకలాపాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సేకరించిన వరిపై బియ్యం పంపిణీ కూడా పురోగతిలో ఉంది.  830 ఎల్ఎంటి వరి సేకరణకు గాను  (బియ్యం పరంగా 558 ఎల్ఎంటి), సెంట్రల్ పూల్‌లో 19.06.2023 వరకు దాదాపు 401 ఎల్ఎంటి బియ్యం సేకరణ జరిగింది. ఇంకా 150 ఎల్ఎంటి ఇంకా జరగాల్సి ఉంది.
కొనసాగుతున్న రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎంఎస్) 2023-24లో గోధుమ సేకరణ కూడా సజావుగా సాగింది. 19.06.2023 వరకు ప్రస్తుత సీజన్‌లో గోధుమల ప్రగతిశీల సేకరణ 262 ఎల్ఎంటి గా ఉంది, ఇది గత సంవత్సరం మొత్తం సేకరణ 188 ఎల్ఎంటి కంటే ఎక్కువగా ఉంది. సుమారు 21.29 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న గోధుమ సేకరణ కార్యకలాపాల నుండి  ఎంఎస్‌పి అవుట్‌ఫ్లో సుమారు రూ. 55,680 కోట్లు. ఈ మొత్తం సేకరణలో అధికంగా పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుండి వరుసగా 121.27 ఎల్ఎంటి,  70.98 ఎల్ఎంటి, 63.17 ఎల్ఎంటి  సేకరణలతో ముందు స్థానంలో ఉన్నాయి. 

గోధుమలు, వరి సేకరణకు కలిపి రైతులకు ఈ ఏడాది  ఎంఎస్‌పి  చెల్లింపు రూ. 2,26,829 కోట్లు గత ఏడాది మొత్తం చెల్లింపు రూ. 2,05,896 కోట్లు.

ప్రస్తుత గోధుమలు, బియ్యం సేకరణతో, ప్రభుత్వ ధాన్యాగారాల్లో తగినంత ఆహార ధాన్యాల నిల్వ ఉంది. గోధుమ, బియ్యం ఉమ్మడి నిల్వలు 570 ఎల్ఎంటి కి చేరుకుంది, ఇది ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి దేశాన్ని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచింది.

 

****


(Release ID: 1934025) Visitor Counter : 158