ప్రధాన మంత్రి కార్యాలయం
ఖగోళ శాస్త్రవేత్త, రచయిత మరియు సైన్స్ కమ్యూనికేటర్ శ్రీ నీల్ డె గ్రాసే టాయ్ సన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 JUN 2023 8:30AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, రచయిత మరియు సైన్స్ కమ్యూనికేటర్ శ్రీ నీల్ డె గ్రాసే టాయ్ సన్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
యువతీ యువకుల లో విజ్ఞాన శాస్త్ర సంబంధి ఆలోచనల ను వృద్ధి చెందింపచేసే అంశం పై ప్రధాన మంత్రి మరియు శ్రీ టాయ్ సన్ లు వారి అభిప్రాయాల ను ఒకరు మరొకరి కి వెల్లడించుకొన్నారు. వారు ఉభయులు అంతరిక్ష రంగం లో భారతదేశం సాధిస్తున్న తీవ్ర ప్రగతి ని, మరి అదే విధం గా భారతదేశం అమలు పరుస్తున్న విభిన్నమైన అంతరిక్ష అన్వేషణ మిశన్ లను గురించి చర్చించారు.
భారతదేశం సరిక్రొత్త గా తీసుకు వచ్చిన జాతీయ అంతరిక్ష విధానం లో భాగం గా ప్రైవేటు రంగ అవకాశాల ను గురించి మరియు విద్య పరమైనటువంటి సహకారాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి మరియు శ్రీ టాయ్ సన్ లు చర్చించారు.
***
(रिलीज़ आईडी: 1934024)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam