ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
తల్లి, నవజాత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న పీఎం ఎన్ సి హెచ్ సహకారంతో మాత, కౌమార, యువత ఆరోగ్యం, సంక్షేమం పై జీ-20 నిర్వహించనున్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్న శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అనురాగ్ ఠాకూర్, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్
మాత , నవజాత, శిశు ఆరోగ్యం (PMNCH), జెనీవా కోసం భాగస్వామ్యంతో నిర్వహించబడిన కౌమారదశలు మరియు యువత ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై G20 కో-బ్రాండెడ్ ఈవెంట్‌ను ప్రారంభించేందుకు
ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ యుక్తవయస్కులు , యువత ఆరోగ్యం , శ్రేయస్సు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్న సమావేశం
ప్రతినిధులలో మూడింట ఒక వంతు మంది భారతదేశం , ఇతర జీ-20 దేశాలకు చెందిన యువకులు
అభివృద్ధి సాధన కోసం భారతదేశంలో కౌమారదశ,, యువతకు సంబంధం ఉన్న అంశాలలో పెట్టుబడులు అవసరం
Posted On:
19 JUN 2023 3:39PM by PIB Hyderabad
'హెల్త్ ఆఫ్ యూత్-వెల్త్ ఆఫ్ నేషన్' అనే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తల్లి, నవజాత, శిశు సంక్షేమం కోసం పనిచేస్తున్న పీఎం ఎన్ సి హెచ్ సహకారంతో 2023 జూన్ 20న సమావేశాన్ని నిర్వహిస్తుంది. జీ-20 సమావేశాల్లో భాగంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.8 బిలియన్ యుక్త వయస్కులు , యువత ఆరోగ్యం , శ్రేయస్సు అంశాలపై సమావేశం ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుంది. యుక్త వయస్కులు, యువత కు సంబంధం ఉన్న రంగాల్లో జీ-20 దేశాల తో సహా అన్ని దేశాలు ప్రాధాన్యత ఇచ్చి తగిన నిధులు కేటాయించేలా చూసే అంశానికి ప్రాధాన్యత ఇచ్చి సమావేశంలో చర్చలు జరుగుతాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమావేశాన్ని ప్రారంభించి కీలక ప్రసంగం చేస్తారు. విద్య, నైపుణ్యాభివృద్ధి ,వ్యవస్థాపకత శాఖ మంత్రి, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘెల్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా సమావేశానికి హాజరవుతారు,యువత ఎదుర్కొంటున్న సవాళ్లు ఎదుర్కోవడం, యువత ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రులు వివరిస్తారు. దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి డాక్టర్ మాతుమ్ జోసెఫ్ 'జో' ఫాహ్లా ప్రారంభ సెషన్‌లో ప్రసంగిస్తారు.
ప్రపంచం మొత్తం మీద 10-24 సంవత్సరాల వయస్సు గల 1.8 బిలియన్ల మంది నివసిస్తున్నారు. భారతదేశంలో అత్యధిక యువజన జనాభా ఉంది. యువత ఏ దేశానికైనా విలువైన ఆస్తిగా ఉంటారు. యువత ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై పెట్టే పెట్టుబడి ఆర్థిక వృద్ధి , అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ జనాభాలో యువత ప్రాధాన్యతను జీ-20 గుర్తించింది. ఢిల్లీ వేదికగా జరిగే సమావేశంలోకౌమారదశలో ఉన్నవారు, యువత ఆరోగ్యం , శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని ప్రధానముగా చర్చిస్తుంది. దేశాభివృద్ధిలో కీలకంగా ఉండే యువ శక్తి పై నమ్మకం ఉంచి వారి శారీరక, మానసిక , సామాజిక శ్రేయస్సు అందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావాలకు అనుగుణంగా సమావేశం జరుగుతుంది. దేశ ఆర్థికాభివృద్ధిలో యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది.
సమాజంలో సానుకూల మార్పు తీసుకు వచ్చే విధంగా యువతను శక్తివంతం చేయడం,జీ-20 దేశాల నుండి విధాన రూపకర్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు, భాగస్వామ్య సంస్థలు, యువత ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే విధంగా చూసి అవగాహన పెంపొందించడం. లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులలో దాదాపు మూడింట ఒక వంతు మంది భారత దేశంలో వివిధ ప్రాంతాలు, జీ-20 సభ్య దేశాలకు చెందిన యువకులు ఉంటారు.పెద్ద సంఖ్యలో యువ ప్రతినిధులు పాల్గొనడం వల్ల యువత ఆరోగ్యం , శ్రేయస్సుకు సంబంధించిన అంశాలు ప్రముఖంగా చర్చకు వస్తాయి. యువ ప్రతినిధులు అందించే సలహాలు, సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్ విధాన సూత్రీకరణలు కార్యాచరణ ప్రణాళిక రూపొందుతాయి.
ఈ కార్యక్రమంలో కౌమార ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై దృష్టి సారించే రెండు సాంకేతిక సదస్సులు, యువత భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. విధాన రూపకల్పనలో యువకుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది.జీ-20 దేశాలకు చెందిన యుక్త వయస్కులు, యువత ఆరోగ్యం , శ్రేయస్సును మెరుగుపరచడానికి సహకరించే వినూత్న విధానాలు, కార్యక్రమాలను చర్చించడానికి మరో సమావేశాన్ని నిర్వహిస్తారు. జీ-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, పీఎం ఎన్ సి హెచ్ బోర్డ్ చైర్‌పర్సన్ హెలెన్ క్లార్క్ ,UNFPA హెడ్‌క్వార్టర్ డైరెక్టర్ డాక్టర్ జూలిట్టా అనబాంజోతో సహా జీ-20 దేశాలకు చెందిన నిపుణులు సమావేశంలో జరిగే ప్రత్యేక చర్చల్లో పాల్గొంటారు.
***
(Release ID: 1933506)
Visitor Counter : 145