రక్షణ మంత్రిత్వ శాఖ
భారతదేశం రెట్టింపయిన సరిహద్దు ముప్పును మరియు యుద్ధరీతులలో కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నందున స్వావలంబన అత్యంత అవసరం: లక్నోలో రక్షణ మంత్రి
“సార్వభౌమ దేశం యొక్క బలమైన స్వీయ-ఆధారిత సైనిక వెన్నెముక అయిన మన సాయుధ దళాలు విదేశీ పరికరాలపై ఆధారపడకుండా ప్రభుత్వం భరోసా ఇస్తుంది”
"ప్రపంచ స్థాయిలో భారతదేశం సైనిక శక్తిగా మారాలంటే సముచిత సాంకేతికతలలో స్వావలంబన తప్పనిసరి"
“యుపి డిఫెన్స్ కారిడార్‌లో 95% భూమిని స్వాధీనం చేసుకున్నారు; 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 109 అవగాహన ఒప్పందాలు కుదిరాయి”
రక్షణ మరియూ పౌర రంగాలకు ప్రయోజనం చేకూర్చే ద్వివిద ప్రయోజన సాంకేతికతని అభివృద్ధి చేయాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు
Posted On:
17 JUN 2023 12:03PM by PIB Hyderabad
భారతదేశం తన సరిహద్దుల్లో రెట్టింపు ముప్పును ఎదుర్కొంటున్నందున, వేగంగా మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న కొత్త యుద్ధ పరిమాణాలతో పాటు స్వావలంబన అనేది కేవలం ఒక ప్రత్యామ్నాయం కాదు, అది ప్రస్తుత తప్పనిసరి అవసరం. జూన్ 17, 2023న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్త్రైవ్ థింక్-ట్యాంక్, రక్షణ రంగ అనుభవజ్ఞుల చొరవ మరియు మీడియా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆత్మనిర్భర్ భారత్’పై డిఫెన్స్ డైలాగ్ సదస్సు సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.
రక్షణ మంత్రి బలమైన మరియు స్వావలంబన కలిగిన సైన్యాన్ని సార్వభౌమ దేశానికి వెన్నెముకగా అభివర్ణించారు, ఇది సరిహద్దులను రక్షించడమే కాకుండా, దేశ నాగరికత మరియు సంస్కృతిని రక్షిస్తుంది. సాయుధ బలగాలు విదేశీ ఆయుధాలు పరికరాలపై ఆధారపడకుండా చూసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భరోసా ఇస్తోందని, ప్రత్యేకించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు నిజమైన బలం ‘ఆత్మనిర్భర్’ అని నొక్కి చెప్పారు.
శ్రీ రాజ్‌నాథ్ సింగ్ యుద్ధ స్వభావంలో సాంకేతికత తీసుకువచ్చిన నమూనా మార్పుపై తన అంతర్దృష్టులను పంచుకున్నారు. కొత్త మరియు ఉద్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించడానికి సాయుధ బలగాలను సన్నద్ధం చేసే మరియు సిద్ధం చేసే స్వదేశీ అత్యాధునిక ఆయుధాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
“ఈ రోజు చాలా ఆయుధాలు ఎలక్ట్రానిక్ ఆధారిత వ్యవస్థలు, ఇవి ప్రత్యర్థులకు సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయగలవు. దిగుమతి చేసుకున్న పరికరాలకు నిర్దిష్ట పరిమితులు ఉన్నందున, మేము పరిధుల ఆవల సముచిత సాంకేతికతలలో స్వయం సమృద్ధిని సాధించాలి. తాజా ఆయుధాలు/పరికరాలు మన సైనికుల ధైర్యంతో పాటు అంతే సమానంగా ముఖ్యమైనవి. భారతదేశం ప్రపంచ స్థాయిలో సైనిక శక్తిగా ఎదగాలని కోరుకుంటే, రక్షణ తయారీలో స్వావలంబన కంటే వేరే మార్గం లేదు, ” అని రక్షణ మంత్రి అన్నారు.
‘ఆత్మనిర్భర్’ వల్ల కలిగే ప్రయోజనాలను జాబితా చేస్తూ, శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఇది దిగుమతులపై వ్యయాన్ని తగ్గించడమే కాకుండా, పౌర రంగానికి బహు కోణాల్లో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ద్విముఖ ప్రయోజన సాంకేతికతని అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, స్నేహపూర్వక దేశాల భద్రతా అవసరాలను కూడా తీర్చే దృఢమైన రక్షణ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను రక్షణ మంత్రి వివరించారు. వీటిలో ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడులో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (డిఐసి) ఏర్పాటు; 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమ కోసం రక్షణ మూలధన సేకరణ బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో 75 శాతం (సుమారు రూ. లక్ష కోట్లు) కేటాయించడం; ప్రైవేట్ పరిశ్రమ కోసం 25 శాతం ఆర్ అండ్ డీ బడ్జెట్ మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX) చొరవ మరియూ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ కోసం ఆవిష్కరణలు వంటి చర్యలను రక్షణ మంత్రి ఉదహరించారు.
యుపి డిఐసి గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, మిషన్ మోడ్‌లో పని జరుగుతోందని మరియు ఇప్పటి వరకు 1,700 హెక్టార్లలో 95% భూమిని సేకరించామని చెప్పారు. వీటిలో 36 పరిశ్రమలు, సంస్థలకు దాదాపు 600 హెక్టార్ల భూమిని కేటాయించారు. 16,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి విలువతో 109 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటివరకు, వివిధ సంస్థల ద్వారా యుపి డిఐసి లో మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కారిడార్ లో విడిభాగాలను ఉత్పత్తి చేయడమే కాకుండా, డ్రోన్‌లు/మానవరహిత వైమానిక వాహనాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ఎయిర్‌క్రాఫ్ట్, బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసి సమకూర్చుతోంది అన్నారు.
రక్షణ మంత్రి గత కొన్ని సంవత్సరాలలో ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా రక్షణ ఉత్పత్తి మరియు దాదాపు 16,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. రక్షణ రంగ ఎగుమతులు త్వరలో రూ.20,000 కోట్ల మార్కును దాటగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాధించేందుకు మేము అత్యంత వేగంతో ముందుకు సాగుతున్నాము. నికర రక్షణ ఎగుమతిదారు కూడా అయిన ఆర్థికంగా శక్తివంతమైన మరియు పూర్తిగా స్వావలంబన వున్న దేశం గా భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యం" అని ఆయన చెప్పారు. .
ఈ కార్యక్రమంలో యూ పీ డీ ఐ సీ చీఫ్ నోడల్ ఆఫీసర్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ కే ఎస్ భదౌరియా (రిటైర్డ్), సాయుధ దళాల అధికారులు మరియు డీ ఆర్ డీ ఓ మరియు పరిశ్రమ మరియు విద్యావేత్తల ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 1933136)
Visitor Counter : 158