ప్రధాన మంత్రి కార్యాలయం

“అబండెన్స్ ఇన్ మిల్లెట్స్” గీతంలో ఆహార భద్రత.. క్షుద్బాధ నిర్మూలన వంటి సదాశయాలతో సృజనాత్మకత మేళవింపు: ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 16 JUN 2023 8:45PM by PIB Hyderabad

   శ్రీ అన్న లేదా చిరుధాన్యాల్లో ఆరోగ్యం-శ్రేయస్సు పుష్కలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించడంలో ప్రధానమంత్రి చూపిన చొరవ స్ఫూర్తితో గ్రామీ అవార్డ్ విజేత భారతీయ-అమెరికన్ గాయకురాలు ఫాలూ ఒక గీతాన్ని రూపొందించారు. చిరుధాన్యాలకు విస్తృత ప్రాచుర్యం, ఆ పంటల సాగుపై రైతులకు ప్రోత్సాహంతోపాటు ప్రపంచ క్షుద్బాధ అంతం లక్ష్యంగా తాను ఈ గీతాన్ని రచించడంలో ప్రధానమంత్రి సహకారాన్ని కొనియాడుతూ ఆమె ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు స్పందనగా ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

“మీ ప్రయత్నం అద్భుతం @FaluMusic! శ్రీ అన్న లేదా చిరుధాన్యాల్లో ఆరోగ్యం-శ్రేయస్సు పుష్కలం. ప్రపంచ ఆహార భద్రత-ఆకలి నిర్మూలన సదాశయాలతో సృజనాత్మకత మేళవించి ఆమె ఈ గీతాన్ని రూపొందించడం హర్షణీయం” అని పేర్కొన్నారు.



(Release ID: 1933059) Visitor Counter : 143