రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఎన్ హెచ్ ఏ ఐ తక్షణ చర్యల ద్వారా ప్రమాద ప్రదేశాలను సరిదిద్దడానికి చొరవ తీసుకుంటుంది

Posted On: 16 JUN 2023 3:49PM by PIB Hyderabad

రహదారి భద్రతను పెంపొందించడానికి,  మరియు తక్షణ చర్యలను అమలు చేయడం ద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలను సరిచేయడానికి ఎన్ హెచ్ ఏ ఐ చొరవ తీసుకుని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, ఎన్ హెచ్ ఏ ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్‌లు ప్రమాదానికి గురయ్యే ప్రదేశాలను గుర్తించి, సంబంధిత రాష్ట్ర పోలీసు చీఫ్ లేదా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ద్వారా ఒక్కో స్పాట్‌కు రూ.10 లక్షలు స్వల్పకాలిక చర్యల కోసం, రూ.10 లక్షల కంటే ఎక్కువ మరియు రూ. 25 లక్షలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి అప్పగించారు.

 

ఈ ఆర్థిక అధికారాలు ఎన్ హెచ్ ఏ ఐ ద్వారా గతంలో జారీ చేయబడిన మార్గదర్శకాల కి అదనం, ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఒక్కో బ్లాక్ స్పాట్‌కు రూ. 25 లక్షలు వరకు స్వల్పకాలిక చర్యల ద్వారా ఎం ఓ ఆర్ టీ హెచ్  నోటిఫైడ్ బ్లాక్‌స్పాట్‌లను సరిదిద్దడానికి ఆమోదించవచ్చు, ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ ప్రమాద ప్రదేశాలను కలిపి పనుల సేకరణను కూడా నిర్వహించవచ్చు.

 

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వచించిన ప్రమాణాల ప్రకారం బ్లాక్ స్పాట్‌లను గుర్తిస్తారు. అయితే, జాతీయ రహదారులపై రహదారి భద్రత మరియు వినియోగదారుల సౌకర్యాన్ని పెంపొందించడానికి, ఎం ఓ ఆర్ టీ హెచ్ ద్వారా సూచించబడిన బ్లాక్ స్పాట్‌లతో పాటు  ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలను సరిచేయడానికి ఎన్ హెచ్ ఏ ఐ ఈ తక్షణ చర్యలతో కూడిన క్రియాశీల చొరవను తీసుకుంది.

 

తక్షణ చర్యలలో ముందస్తు హెచ్చరిక సంకేతాలతో కూడిన జీబ్రా క్రాసింగ్‌లు, క్రాష్ అడ్డంకులు, రెయిలింగ్‌లు, జంక్షన్ మెరుగుదల, సోలార్ లైట్లు/ బ్లింకర్‌లు, రోడ్డు సంకేతాలు మరియు ట్రాఫిక్‌ను, వేగాన్ని తగ్గించే చర్యల అమలు,  వాహనదారుల సౌకర్యాలను మెరుగుపరచడం, జాతీయ రహదారులపై భద్రతను మెరుగుపరచడం అత్యంత ప్రాధాన్యతలలో ఒకటి. ఎన్ హెచ్ ఏ ఐ  జాతీయ రహదారులపై ప్రయాణించే వారందరికీ సురక్షితమైన, మృదువైన మరియు సాఫీ  ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉంది.

 

***



(Release ID: 1933007) Visitor Counter : 111