శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారత సంతతికి చెందిన సైన్స్, టెక్నాలజీ , ఇంజనీరింగ్ , మాథమాటిక్స్, మెడిసిన్ (ఎస్టిఇఎంఎం) రంగాల వారిని


భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేసే వైభవ్ ఫెలోషిప్ కార్యక్రమం
‌‌‌‌‌‌‌‌‌‌

Posted On: 15 JUN 2023 3:48PM by PIB Hyderabad

 

భారత సంతతికి చెందిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్, మెడిసిన్ (ఎస్.టి.ఇ.ఎం.ఎం) రంగాల వారిని,
భారతీయ విద్యా సంస్థలు, పరిశోధన అభివృద్ధి సంస్థలతో సమష్టి పరిశోధన చేపట్టడానికి అనుసంధానం చేసేందుకు
కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యుత్తమ విజ్ఞానాన్ని, మేథస్సును
ఉన్నత పద్ధతులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుంది.

ఈ ఫెలోషిప్ పేరు వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ (వైభవ్)ఫెలోషిప్. దీనిని కేంద్ర శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వశాఖలోని , సైన్స్ , టెక్నాలజీ విభాగం అమలు చేస్తుంది.
భారతీయ మూలాలు కలిగిన  ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులకు , తమ తమ దేశాలలో పరిశోధనలలో నిమగ్నమైనవారికి ఈ ఫెలోషిప్లను అందజేస్తారు.
అంటే భారత సంతతికి చెందిన ఎన్.ఆర్.ఐ.లు, ఒసిఐలు, పిఐఒలకు వీటిని అందజేస్తారు.
 ఇలా ఎంపిక చేసిన 75 మంది పరిశోధకులను ఆహ్వానికి ప్రభుత్వం   గుర్తించిన 18 శాస్త్ర రంగాలలో పనిచేయాల్సిందిగా కోరుతారు. అందులో
క్వాంటమ్ టెక్నాలజీ, ఆరోగ్యం,ఫార్మా, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, ఇంధనం, కంప్యూటర్ సైనస్, మెటీరియల్ సైన్స్ వంటి వి ఉన్నాయి.
భారతీయ స్టెమ్ డయాస్పారోను భారతీయ సంస్థలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం వైభవ్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది.
దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో దాదాపు 25 వేల మంది పాల్గొన్నారు. 70 దేశాలకు పైగా చెందిన  భారతీయ శాస్త్రవేత్తలు,
శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు.
“ సైన్సు, పరిశోధన, ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.,
సామాజిక, ఆర్ధిక పరివర్తన దిశగా చేస్తున్న కృషిలో సైన్సు ఎంతో కీలకమైనది.”అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వైభవ్ సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో అన్నారు.
వైభవ్ ప్రోగ్రాం అమలుకు అనుగుణంగా ఈ ఫెలో షిప్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది భారతీయ సంతతి శాస్త్రవేత్తలు,
భారతీయ ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలు, లేదా ప్రభుత్వ వ్యయంతో నడిచే శాస్త్రవిజ్ఞాన సంస్థలతో పరస్పర సహకారానికి వీలు కల్పిస్తుంది.
ఇందుకు సంబంధించిన దరఖాస్తులను 15 జూన్ 2023 నుంచి 31 జూలై 2023 వరకు స్వీకరిస్తారు.
వైభవ్ కార్యక్రమం కింద పరస్పర సహకారానికి ఫెలో ను భారతీయ సంస్థలు ఎంపికచేస్తాయి. దీని ప్రకారం వారు సంవత్సరంలో రెండు నెలలు
వంతున గరిష్ఠంగా 3 సంవత్సరాలు పరిశోధనలు చేయవలసి ఉంటుంది. ఫెలో షిప్లో ఫెలో షిప్ గ్రాంటుగా నెలకు4 లక్షల రూపాయలు,
అంతర్జాతీయ, దేశీయ రవాణా చార్జీలు, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. వైభవ్ ఫెలోషిప్ పొందిన వారు పరిశొధన కార్యకలాపాలలో పాలుపంచుకుంటూ
భారతీయ సహచరులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది. వారితో కలిసి పరిశోధన కార్యకలాపాలలో పాల్గొనాల్సి ఉంటుంది.
శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోదనలలో తమ సహకారాన్ని అందించాలి. ఈ ఫెలోషిప్కు దరఖాస్తు చేసుకోదలచిన వారు ప్రతిపాదనల నమూనాలను www.dst.gov.in / www.onlinedst.gov.in వెబ్సైట్ లనుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తులను పూర్తిచేసి సంబంధిత సమాచారంతో శాస్త్ర సాంకేతిక విభాగానికి చెందిన e-PMS పోర్టల్లో సమర్పించాల్సిఉంటుంది.

 

***



(Release ID: 1932843) Visitor Counter : 166