సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రానున్న బిపర్‌జాయ్ తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా గుజరాత్‌లోని ద్వారకలో ఆకాశవాణి టవర్ కూల్చివేత
Posted On:
14 JUN 2023 2:37PM by PIB Hyderabad
రానున్న తుపాను బిపర్‌జాయ్ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్‌లోని ద్వారకలో ఆకాశవాణి ఉక్కు టవర్‌కు మద్దతుగా బిగించిన 90 మీటర్ల ఎత్తైన తాడును విప్పివేశారు. ఈ పనిని పరిసర ప్రాంతాలలో ఎటువంటి ప్రమాదాన్ని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేయడం జరిగింది. ఈ 35 ఏళ్ళ టవర్ రక్షణ ఆడిట్ చేసిన ఎన్ఐటి సూరత్, సిసిడబ్ల్యుకి చెందిన నిర్మాణ నిపుణులు ఈ టవర్‌ను కూల్చివేయవలసిందిగా జనవరి 2023లో చేసిన సూచనను అనుసరించి ఈ చర్య చేపట్టారు. అదే సమయంలో, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి ద్వారక నుంచి సేవలను పునరుద్ధరించేందుకు ఆకాశవాణి కృషి చేస్తోంది.
***
(Release ID: 1932687)
Visitor Counter : 97