ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌లో "ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని" ప్రారంభించిన ఎంఓఎస్‌ (హెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బాఘెల్

ఈ సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవ ప్రచార నినాదం 'రక్తం ఇవ్వండి, ప్లాస్మా ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి, తరచుగా పంచుకోండి'.

సేవా మరియు సహయోగ్ స్ఫూర్తి మరియు గొప్ప సంప్రదాయాన్ని అనుసరించి రక్తదాన డ్రైవ్ గొప్ప కారణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరిన ప్రొఫెసర్ ఎస్ పి బాఘెల్

సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు మరియు ఒక యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది: ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బఘెల్

"రక్తదానానికి సంబంధించిన అపోహలను తొలగించడంపై దృష్టి పెట్టాలి మరియు రక్తదానం చేయమని ప్రజలను ప్రోత్సహించాలి"

Posted On: 14 JUN 2023 3:08PM by PIB Hyderabad

“రక్తదానం ఒక గొప్ప కార్యం మరియు మన గొప్ప సంస్కృతి,  సేవా మరియు సహయోగ్ సంప్రదాయంలో నిక్షిప్తమై ఉంది. దేశవ్యాప్త రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పౌరులందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని నేను కోరుతున్నాను మరియు పిలుపునిస్తున్నాను. రక్తదానం దేశ అవసరాలను తీర్చడంతో పాటు సమాజానికి మరియు మానవాళికి ఒక ముఖ్యమైన సేవ అని ఈ రోజు న్యూఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్‌ ఎస్‌పి బఘెల్ తెలిపారు.

ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవ ప్రచార నినాదం 'రక్తం ఇవ్వండి, ప్లాస్మా ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి, తరచుగా పంచుకోండి'. ఇది జీవితాంతం రక్తమార్పిడి మద్దతు అవసరమయ్యే రోగులపై దృష్టి పెడుతుంది మరియు రక్తం లేదా ప్లాస్మా యొక్క విలువైన బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి పోషించగల పాత్రను నొక్కి చెబుతుంది.

 

image.pngimage.png

image.png

image.png

 



కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్‌పి బఘెల్..రక్తదానం మరియు రక్తదాన్ అమృత్ మహోత్సవ్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. “భారతదేశంలో ప్రతి 2 సెకన్లకు రక్త మార్పిడికి డిమాండ్ పుడుతుంది. సగటున, ప్రతి సంవత్సరం 14.6 మిలియన్ల రక్తం అవసరమవుతుంది మరియు ఎల్లప్పుడూ 1 మిలియన్ల కొరత ఉంటుంది.సరైన అవగాహన లేకపోవడంతో పాటు రక్తదానంపై అనేక అపోహలు సందేహాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యవంతమైన వ్యక్తులను రక్తదాతలుగా మారకుండా నిరుత్సాహపరుస్తున్నాయి. క్యాన్సర్ రోగులు, సికిల్ సెల్ అనీమియా మరియు తలసేమియా రోగులకు తరచూ రక్తం అవసరమవుతుంది. ప్రతి రెండు సెకన్లలో భారతదేశంలో ఒకరికి రక్తం అవసరమవుతుంది మరియు మన జీవితకాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది" అని ఆయన తెలిపారు. "సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు మరియు 1 యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుంది" అని ప్రొఫెసర్ ఎస్ పి బాఘెల్ పేర్కొన్నారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్ సాధారణ వేతనం లేని స్వచ్ఛంద రక్తదానాల గురించి అవగాహన పెంచడం మరియు రక్తం లేదా దాని భాగాలు (మొత్తం రక్తం/ ప్యాక్ చేసిన ఎర్ర రక్త కణాలు/ప్లాస్మా/ప్లేట్‌లెట్స్) అందుబాటులో ఉండేలా సరసమైన ధరలో మరియు సురక్షితంగా ఉండేలా చూడడం లక్ష్యంగా పెట్టుకుంది.

రక్తదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ “రక్తదానం బలహీనతను కలిగించదు, ఇది ఒక అపోహ మాత్రమే. ఒక వ్యక్తి శరీరంలో 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది మరియు ప్రతి 90 రోజులకు (3 నెలలు) రక్తదానం చేయవచ్చు. శరీరం చాలా త్వరగా రక్తాన్ని తిరిగి పొందగలదు; రక్త ప్లాస్మా పరిమాణం 24 - 48 గంటల్లో, ఎర్ర రక్త కణాలు సుమారు 3 వారాల్లో మరియు ప్లేట్‌లెట్స్ & తెల్ల రక్త కణాలు నిమిషాల్లో తయారవుతాయి. రక్తదానం వల్ల ఎటువంటి బలహీనత రాదు. ప్రజలు రక్తదానం చేసే ముందు రక్త పరీక్ష చేయించుకోవాలని అర్థం చేసుకోవాలి మరియు రక్తదానం చేసిన 3 నెలల వరకూ మరోసారి రక్తదానం చేయలేరు" అని ఎస్‌పి బాఘెల్.

రక్తదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే రక్తదానం మరియు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను మన భావి తరానికి అర్థం చేసుకోవాలి మరియు నేర్పించాలి. ప్రపంచ ప్రజలు కూడా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఇప్పటికీ ఈ అపోహల ఎక్కువగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో రక్తదాన అపోహలను తొలగించడం గురించి మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

రక్తదాన శిబిరంలో దాతలను ప్రొ. ఎస్‌పి బాఘెల్ కలుసుకుని నిస్వార్థంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అలాగే 100 సార్లు రక్తదానం చేసిన రక్తదాతలను ఆయన అభినందించారు.

రక్తదాతల జాతీయ రిపోజిటరీగా పనిచేసే ఈ-రక్త్ కోష్ పోర్టల్ అనే కేంద్రీకృత బ్లడ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మద్దతిచ్చే దేశవ్యాప్త డ్రైవ్‌ను కూడా ఆయన హైలైట్ చేశారు. ఇది రక్త దాతల యొక్క బలమైన రికార్డును కూడా నిర్ధారిస్తుంది మరియు అవసరమైనప్పుడు రక్త లభ్యతను వేగవంతం చేస్తుంది.

ఈ-రక్త్ కోష్ పోర్టల్ కోసం లింక్:

 https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html

***



(Release ID: 1932666) Visitor Counter : 132