యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చాణు, సిడబ్ల్యుజి పతకవిజేత బింద్యారాణి దేవిలు యుఎస్ఎలోని సెయింట్ లూయిస్ లో శిక్షణ పొందేందుకు ఆమోదాన్ని తెలిపిన ఎంఒసి
Posted On:
13 JUN 2023 5:25PM by PIB Hyderabad
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం (లక్ష్యిత ఒలింపిక్ వేదిక పథకం) కింద యుఎస్ ఎలోని సెయింట్ లూయిస్‌లో విదేశీ శిక్షణా శిబిరానికి అథ్లీట్లు మీరాబాయి చాణు, బింద్యారాణి దేవీలను పంపాలన్న ప్రతిపాదనకు యువజన వ్యవహారాలు, క్రీడలు (ఎంవైఎఎస్) మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఒసి) ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆమోదాన్ని తెలిపింది.
త్వరలో జరుగనున్న ఆసియన్ క్రీడలకు ముందు పునరావాసం, పటుత్వ శిక్షణ ప్రక్రియను సానపెట్టుకునేందుకు సెయింట్ లూయీస్‌లోని స్క్వాట్ యూనివర్సీటీలో డాక్టర్ ఆరన్ హోర్షిగ్ ఆధ్వర్యంలో ఒలింపిక్, కామన్‌వెల్త్ క్రీడల మెడలిస్టులు శిక్షణ పొందనున్నారు.
తమ 65 రోజుల విదేశీ శిక్షణా శిబిరం సందర్భంగా, వీరిద్దరికీ భారతీయ చీఫ్ కోచ్ విజయ్ శర్మ, వారి ఫిజియోథెరపిస్ట్ తెస్నీం జయ్యద్‌లు అనుసరించి, సహకరిస్తారు.
ప్రభుత్వం వారికి సంబంధించిన ఇతర ఖర్చులతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు, బోర్డింగ్, లాడ్జింగ్ వ్యయం, మెడికల్ ఇన్సూరెన్స్, స్థానిక రవాణా ఖర్చు, జిమ్ ఖర్చులు, వైద్య సంప్రదింపుల వ్యయాన్ని భరిస్తుంది.
***
(Release ID: 1932150)