మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘‘వ్యసన రహిత అమృత్ కాల్”జాతీయ ప్రచారాన్ని ప్రారంభించిన ఎన్.సి.పి.ఆర్.


పిల్లలలో పొగాకు, మాదకద్రవ్యాల వ్యసనం లేని దేశంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రచారం.

Posted On: 07 JUN 2023 12:02PM by PIB Hyderabad

 

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్) వ్యసన రహిత అమృత్ కాల్ పేరుతో జాతీయ ప్రచారాన్ని 2023 మే 31 వ తేదీన , ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఎన్సిపిసిఆర్ లో విజయవంతంగా ప్రారంభించింది. 

ఆరోగ్యవంతమైన , వ్యసనాలు లేని భారతదేశాన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పొగాకు రహిత, మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రచారాన్ని ఉద్దేశించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌సిపిసిఆర్‌, టుబాకో ఫ్రీ ఇండియా అనే పౌర సంస్థ సహకారంతో చేపట్టారు. దేశంలో పిల్లలలో పొగాకు వాడకం మాదక ద్రవ్యాల వ్యసనం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు కృషి చేస్తుంది.
ఎన్‌సిపిసిఆర్‌ ఛైర్‌ పర్సన్‌ శ్రీ ప్రియాంక కనుంగో, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, ఒటిటి ప్లాట్‌ఫారంలపై పొగాకు వాడుతున్న దృశ్యాలు చూపకుండా నియంత్రణలు విధించేందుకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ప్రశంసించారు. దీనికి తోడు, పిల్లలకు పొగాకు రహిత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన సిఒటిపిఎ సవరణను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.

.పొగాకు ఉత్పత్తులకు, మాదకద్రవ్యాల వ్యసనానికి మధ్య ఉన్న ఆందోళనకర బంధం గురించి శ్రీ కనూంగో ప్రముఖంగా ప్రస్తావించారు. పిల్లలు పొగాకు పట్ల ఆకర్షితులయ్యేలా చేయడంలో వినోద పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. చలనచిత్రాలలో పొగాకు ఉత్పత్తుల వాడకానికి సంబంధించిన దృశ్యాలు కనిపించినపుడు, వాటికి సంబంధించిన హెచ్చరికలు ఉండాలని నిబంధనలు ఉన్నాయని, అలాగే ఒటిటి ` ఓవర్‌ ది టాప్‌ ప్లాట్‌ఫారం లకు సంబంధించి  కూడా నిబంధనల అవసరం అత్యావశ్యకం.ఒటిటి ప్లాట్‌ ఫారంలు ఇటీవలి కాలంలో బహుళ ప్రచారం పొందాయి. కొన్ని సందర్భాలలో ఈ ప్లాట్‌ఫారంలు దుర్వినియోగం అవుతున్నాయి కూడా.  ఒటిటి ప్లాట్‌ఫారంలలో పొగాకు వినియోగదృశ్యాలను నియంత్రించేందుకు నియంత్రణలు అవసరమని కమిషన్‌ సిఫారసు చేసింది. ప్రస్తుతం, ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా అవసరమైన నియంత్రణలను తీసుకువచ్చింది. దీని ద్వారా ఒటిటి ప్లాట్‌ఫారంలపై పొగాకు వాడకం దృశ్యాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనడానికి వీలు కలుగుతుంది.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని(సిఒపిటిఎ) తాను గట్టిగా బలపరుస్తున్నట్టు ఆయన తెలిపారు.
పొగాకు వాడకాన్ని నియంత్రించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రత్యేకించి చిన్న పిల్లలు పొగాకు వాడకాన్ని నియంత్రించడంలో ఒక కీలక ఉపకరణంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ చట్టంలో కఠినమైన చర్యలు ఉన్నాయని, అన్ని రూపాలలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలకు సంబంధించి నియంత్రించే చర్యలు ఉన్నాయని తెలిపారు. పొగాకుఉత్పత్తుల అమ్మకపుప్రాంతాలలో, పబ్లిక్‌ప్రాంతాలలో స్మోకింగ్‌ జోన్‌ల వంటి వాటి ఏర్పాటుకు ఇది స్వస్తి పలుకుతుందని అన్నారు. 

చిన్న పిల్లలకు సంబంధించి నిర్వహిస్తన్న ప్రత్యేక కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ,  పరోక్షంగా పొగాకుఉత్పత్తులు వాడకం వల్ల ప్రభావితులయ్యే పిల్లలతో  పాఠశాలల్లో ప్రహారి క్లబ్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  ఇప్పటివరకు ఇలాంటి 60 వేల ప్రహారి క్లబ్బులు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.   ఇండియాను పొగాకు నుంచి మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసేందుకు ఈ క్లబ్బులు ఉపకరిస్తాయన్నారు. ప్రభుత్వానికి కళ్లు , చెవులుగా ఇవి పనిచేస్తాయన్నారు. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం, మాదక ద్రవ్యాల విక్రయం  జరుగుతున్నట్టు తెలిస్తే ఈ క్లబ్బుల ద్వారా ఆ సమాచారం ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు.
విజ్ఞాన భారతి  జాతీయ కార్యదర్శి శ్రీ ప్రవీణ్ రామ్ దాస్ ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేస్తూ, వివిధ రకాల వ్యసనాలను దూరం చేయడంలో విద్యా సంస్థలు సంప్రదాయ , సమగ్ర పద్ధతులను పాటించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.  కొందరు ఇటీవలి కాలంలో ఈ వ్యసనాలను ఫ్యాషన్ గా, స్వేచ్ఛకు  గుర్తుగా చెప్పుకుంటుండడం ఆందోళన కలిగిస్తొందని చెప్పారు. ప్రస్తుత చట్టంలోని లోపాలను సరిదిద్దడమే కాక, మంచి అలవాట్లను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం పై దృష్టి పెట్టవలసి ఉందని ఆయన అన్నారు.

ఢిల్లీ ఎయిమ్స్  కు చెందిన రుమటాలజీ విభాగ అధిపతి  , ప్రముఖ ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ ఉమా కుమార్, మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల ఏటా 13 లక్షల మంది చనిపోతున్నారని  ఆమె తెలిపారు. సిఒటిపిఎఎఎ సవరణ బిల్లు ప్రజల ప్రాణాలు కాపాడడమే కాక,  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం తగ్గిస్తుందని చెప్పారు.  సిఒపిటిఎ సవరణలను వెంటనే అమలు చేయాల్సిందిగా ఆమె కోరారు.  ఈ విషయంలో ప్రతి క్షణమూ విలువైనదే నని ఆమె తెలిపారు. పొగాకు ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆమె అన్నారు.
ప్రపంచ పొగాకు రహిత దినం థీమ్ గురించి మాట్లాడుతూ, మనకు ఆహారం కావాలి కాని పొగాకు కాదు అన్నది ఈ ఏడాది నినాదం గా తెలిపారు. పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్లకే కాక, ఈ ఉత్పత్తులు తయారు చేయడంలో పనిచేఏ వారు కాన్సర్ సహా, గ్రీన్ టుబాకో వ్యాధి బారిన పడుతున్నారన్నారు.
పొగాకు రహిత చొరవ కార్యక్రమానికి  ప్రాంతీయ సలహాదారుగా ఉన్న డాక్టర్ జగదీష్ కౌర్ మాట్లాడుతూ, వ్యసనాలను నిరధించడంలో అంతర్జాతీయ దృష్టి, గురించి ప్రస్తావించారు.  పొగాకు ఉత్పత్తులవల్ల  కలిగే అనర్థాల గురించి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని, మరోవైపు ఈ పరిశ్రమ , కొత్త యువతను  ఈ ఉచ్చులోకి దింపేందుకు విభిన్న పద్ధతులు
అవలంబిస్తోందని చెప్పారు. ఒటిటి ప్లాట్ఫారంలపై పొగాకు ఉత్పత్తులను  నియంత్రించేందుకు చర్యలు
 తీసుకుంటుండడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో , పొగాకు రహిత, మాదక ద్రవ్యాల రహిత పరిసరాలను కలిగి ఉండేందుకు పిల్లలకు గల హక్కులను ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే పలు కార్యక్రమాలు, వర్క్షాప్లు, అవగాహనా కార్యక్రమాలు,ఔట్ రీచ్ కార్యక్రమాలు, వంటివాటిని పాఠశాలల్లో, తల్లిదండ్రుల  సమావేశాలు,  పలు ఇతర సమావేశాల ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పొగాకు నియంత్రణ కార్యకర్త     శ్రీముఖేష్ కేజ్రివాల్, మోడరేటర్ గా వ్యవహరించారు. కార్యక్రమం చివరలో ఎన్సిపిసిఆర్ సభ్య కార్యదర్శి శ్రీమతి రూపాలి బెనర్జీ సింగ్ నిపుణులకు  ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నందుకు  కృతజ్ఙతలు తెలిపారు. భవిష్యత్తులోనూ వారి సహకారాన్ని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు.

***


(Release ID: 1931294) Visitor Counter : 149