మంత్రిమండలి
azadi ka amrit mahotsav

హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ, స్పర్ తో గురుగ్రామ్ నుంచి ద్వారకా ఎక్స్ ప్రెస్ వే వరకు మెట్రో కనెక్టివిటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం


పూర్తి ఎలివేటెడ్ ప్రాజెక్టు కు రూ.5,452 కోట్ల వ్యయం

Posted On: 07 JUN 2023 3:02PM by PIB Hyderabad

 గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ వరకు స్పర్ తో గురుగ్రామ్ లోని ద్వారకా ఎక్స్ ప్రెస్ వే వరకు 27 స్టేషన్లతో 28.50 కిలోమీటర్ల మేర మెట్రో కనెక్టివిటీకి ఆమోదం తెలిపింది.

 

ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.5,452 కోట్లు.  ఇది 1435 మిమీ (5 అడుగుల 8.5 అంగుళాలు) ప్రామాణిక గేజ్ లైన్.  ప్రాజెక్టు మొత్తాన్ని ఎలివేట్ చేయనున్నారు.  బసాయి గ్రామం నుంచి డిపోకు కనెక్టివిటీ కల్పించారు.

 

ఈ ప్రాజెక్టు మంజూరైన తేదీ నుంచి నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రతిపాదించగా, అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, హరియాణా ప్రభుత్వం 50:50 స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా ఏర్పాటు చేసే హరయానా మాస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎం ఆర్ టి సి) అమలు చేయనుంది.

 

 

కారిడార్ పేరు

పొడవు

(కి. మీ. లో)

స్టేషన్ ల సంఖ్య

ఎలివేటెడ్/ అండర్ గ్రౌండ్

హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ - మెయిన్ కారిడార్

26.65

 

26

ఎలివేటెడ్

బసాయి గ్రామం నుండి ద్వారకా ఎక్స్ ప్రెస్ వే - స్పర్

1.85

0.1

ఎలివేటెడ్

మొత్తం

28.50

27

 

 

ప్రయోజనాలు:

 

ప్రస్తుతం ఓల్డ్ గురుగ్రామ్ లో మెట్రో లైన్ లేదు. న్యూ గురుగ్రామ్ ను పాత గురుగ్రామ్ తో అనుసంధానించడం  ఈ రైలు మార్గం ప్రత్యేకత. ఈ నెట్వర్క్ భారతీయ రైల్వే స్టేషన్ తో అనుసంధానించబడుతుంది. తదుపరి దశలో ఐజీఐ విమానాశ్రయానికి కనెక్టివిటీ కల్పిస్తుంది. ఇది ఆర్టియాలో మొత్తం ఆర్థిక అభివృద్ధిని కూడా అందిస్తుంది.

 

అనుమతి పొందిన కారిడార్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

 

వివరాలు

హుడా సిటీ సెంటర్ నుంచి సైబర్ సిటీ వరకు

పొడవు

28.50 Km

స్టేషన్ ల సంఖ్య

27 స్టేషన్ లు

( అన్నీ ఎలివేటెడ్)

అలైన్మెంట్

కొత్త గురుగ్రామ్ ప్రాంతం

పాత గురుగ్రామ్ ప్రాంతం

హుడా సిటీ సెంటర్ - సెక్టార్ 45 - సైబర్ పార్క్ - సెక్టార్ 47 - సుభాష్ చౌక్ - సెక్టార్ 48 - సెక్టార్ 72ఎ - హీరో హోండా చౌక్ - ఉద్యోగ్ విహార్ ఫేజ్ 6 - సెక్టార్ 10 - సెక్టార్ 37 - బసాయి విలేజ్ - సెక్టార్ 9 - సెక్టార్ 7 - సెక్టార్ 4 - సెక్టార్ 5 - అశోక్ విహార్ - సెక్టార్ 3 - బజ్ఘేరా రోడ్ - పాలం విహార్ ఎక్స్టెన్షన్ - పాలం విహార్ - సెక్టార్ 23 ఎ - సెక్టార్ 2 స్పర్ టు ద్వారకా ఎక్స్ ప్రెస్ వే (సెక్టార్ 101)

డిజైన్ స్పీడ్

80  కే ఎం పి హెచ్

సగటు వేగం

34 కే ఎం పి హెచ్

ప్రతిపాదిత పూర్తి ఖర్చు

రూ.5,452.72 కోట్లు

భారత ప్రభుత్వ వాటా రూ.896.19 కోట్లు

జి ఒ హెచ్ వాటా రూ. 1,432.49 కోట్లు

స్థానిక సంస్థల వాటా(హుడా) రూ.300 కోట్లు

పి టి ఎ  (పాస్ త్రూ అసిస్టెన్స్)- రుణం భాగం - రూ.Rs. 2,688.57 కోట్లు

పి పి పి  (లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్) -

రూ.135.47 కోట్లు

పూర్తి అయ్యే సమయం

ప్రాజెక్ట్ మంజూరైన తేదీ నుంచి 4 సంవత్సరాలు

అమలు చేసే సంస్థ

హర్యానా మాస్ రాపిడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎం ఆర్ టి సి)

ఫైనాన్షియల్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎఫ్ఐఆర్ఆర్)

 

 

*** 


(Release ID: 1930506) Visitor Counter : 169