సహకార మంత్రిత్వ శాఖ

సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ ( సి ఆర్ సి ఎస్) కార్యాలయం కంప్యూటరీకరణ పురోగతిని సమీక్షించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


2021 జూలైలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన 'సహకారంతో సమృద్ధి' లక్ష్యాన్ని సాధించడానికి సహకార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది.... శ్రీ అమిత్ షా

బహుళ రాష్ట్ర సహకార సంఘాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి డిజిటల్ వ్యవస్థ అభివృద్ధి
నూతన సంఘాల రిజిస్ట్రేషన్‌తో సహా అన్ని కార్యకలాపాలను సులభతరం చేయడానికి సహకార సంఘాల సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం కంప్యూటరీకరణ

26 జూన్ 2023 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా సాఫ్ట్‌వేర్, పోర్టల్ అభివృద్ధి
పోర్టల్ మెరుగైన వినియోగం,విశ్లేషణల కోసం నిర్వహించే పోటీల్లో యువత పాల్గొనేలా చూడాలని సి ఆర్ సి ఎస్ కు ఆదేశాలు జారీ చేసిన శ్రీ అమిత్ షా

కంప్యూటరీకరణతో సులభంగా నూతన బహుళ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రేషన్, మెరుగుపడనున్న సంఘాల పనితీరు

Posted On: 07 JUN 2023 12:24PM by PIB Hyderabad

సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ ( సి ఆర్ సి ఎస్) కార్యాలయం కంప్యూటరీకరణ పురోగతిని  కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా సమీక్షించారు. సమీక్షా  సమావేశంలో సహకార మంత్రిత్వ  శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

2021 జూలైలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన  'సహకారంతో సమృద్ధి' లక్ష్యాన్ని సాధించడానికి సహకార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి    సహకార మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 అమలు చేయాల్సి ఉన్న సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయాన్ని కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. 

బహుళ రాష్ట్రాల సహకార సంఘాల కార్యకలాపాలు సులభంగా జరిగేలా చూసేందుకు అవసరమైన డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కంప్యూటరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహుళ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రేషన్ సులువుగా జరిగేలా చూసేందుకు, ప్రస్తుతం పనిచేస్తున్న సంఘాల పనితీరు మెరుగుపరచడానికి కంప్యూటరీకరణ తోడ్పడుతుంది. కార్యక్రమాన్ని 2023   జూన్ 26  నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం సాఫ్ట్‌వేర్, పోర్టల్ అభివృద్ధి చేస్తున్నారు. 

పోర్టల్  మెరుగైన వినియోగం,విశ్లేషణల కోసం నిర్వహించే పోటీల్లో యువత పాల్గొనేలా చేయాలని సి ఆర్ సి ఎస్ కు శ్రీ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. 

కంప్యూటరీకరణతో సులభంగా నూతన బహుళ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న సంఘాల పనితీరు మెరుగుపడుతుంది. .

కంప్యూటరీకరణ ప్రధాన లక్ష్యం:

 

i. పూర్తిగా కాగిత రహిత పాలన, దరఖాస్తులపరిశీలన 

ii. సాఫ్ట్‌వేర్ ద్వారా మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 నిబంధనల అమలు

iii . సులభతర వ్యాపార నిర్వహణ 

iv. డిజిటల్ కమ్యూనికేషన్ 

v. పారదర్శక ప్రక్రియ 

vi. మెరుగైన విశ్లేషణలు

ఇప్పటికే కంప్యూటరీకరణ పనులు ప్రారంభమయ్యాయి.మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ వెర్షన్ I ఇప్పటికే సిద్దమయ్యింది.  నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. వెర్షన్ II లో మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 లో పొందుపరిచే సవరణలు,నిబంధనలు  కలిగి ఉంటుంది.  వినియోగదారుల నుంచి అందే సలహాలు, సూచనలు, అభిప్రాయాలను దృష్టిలో లోపాలు తొలగించడానికి చర్యలు అమలు జరుగుతాయి. 

కింది అంశాలు నూతన పోర్టల్‌లో భాగంగా ఉంటాయి : 

i. నమోదు

ii. ఉప చట్టాల సవరణ

iii. వార్షిక నివేదికల సమర్పణ 

iv. అప్పీల్ చేయడం 

v. ఆడిట్

vi. తనిఖీ

vii. విచారణ

viii. మధ్యవర్తిత్వ

ix. మూసివేయడం, దివాళా తీయడం 

సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్  కార్యాలయంలో ఎలక్ట్రానిక్ విధానంలో  దరఖాస్తు/సేవా అభ్యర్థనలను సమయానుకూలంగా ప్రాసెస్ చేయడానికి  సాఫ్ట్‌వేర్ ఉపకరిస్తుంది. ఓటీపీ ఆధారంగా   వినియోగదారు నమోదు,  చట్టం నిబంధనలకు అనుగుణంగా ధ్రువీకరణ తనిఖీలు,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ మరియు ఎలక్ట్రానిక్‌ విధానంలో కార్యకలాపాలు చేపట్టడానికి  సాఫ్ట్‌వేర్ సౌకర్యం కలిగి ఉంటుంది.

 

***



(Release ID: 1930447) Visitor Counter : 146